Singer Died: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సీనియర్ నటీనటులు ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ ఉండగా.. ఇప్పుడు ఒక జూనియర్ నటి మరణించడంతో ఇండస్ట్రీ కూడా ఉలిక్కిపడింది. ప్రముఖ గాయనిగా, నటిగా, వ్యాపారవేత్తగా గుర్తింపు సొంతం చేసుకున్న ప్రెటా గిల్ (Preta Gil)తుది శ్వాస విడిచారు.
ప్రముఖ గాయని, నటి ప్రెటా గిల్ కన్నుమూత..
తనదైన స్వరంతో సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈమె.. 2023 జనవరిలో పేగు క్యాన్సర్ బారిన పడింది. కాన్సర్ తో పోరాటం చేసి చివరికి న్యూయార్క్ నగరంలో జూలై 20న తుది శ్వాస విడిచింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈమె మరణంతో సంగీత ప్రపంచం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నది అని చెప్పవచ్చు. గొప్ప సింగర్ గా, నటిగా కూడా తన టాలెంట్ ను నిరూపించుకున్న ఈమె.. ఇలా క్యాన్సర్ బారినపడి మరణించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రెటా గిల్ కెరియర్..
ఈమె ఎవరో కాదు బ్రెజిల్ సంగీత కళాకారుడు, మాజీ సాంస్కృతిక మంత్రి గిల్బర్టో గిల్ కుమార్తె. 1974 ఆగస్టు 8న జన్మించిన ఈమె.. 2003లో తన మొదటి స్టూడియో ఆల్బమ్ ను రిలీజ్ చేశారు. “ప్రిట్ : ఏ పోర్టర్” గా రిలీజ్ అయిన ఈ ఆల్బమ్ మంచి సక్సెస్ అందుకుంది. ఇక కవర్ CD కవర్ పేజీ కోసం కొన్ని నగ్న చిత్రాలకు కూడా ఈమె ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక రెండవ స్టూడియో ఆల్బమ్ 2005 సెప్టెంబర్ లో విడుదల కాగా ఇందులో వెరీ డేంజరస్ , యు అండ్ మెనీ యు అండ్ మీ వంటి పాటలు మంచి ప్రజాదరణ పొందాయి. ఇక 2010 FIFA ప్రపంచ కప్ కోసం కూడా ఈమె ఎదురుచూసింది. అటు పాప్ సింగర్ గా కూడా పేరు సొంతం చేసుకున్న ఈమె వ్యక్తిగతంగా వైవాహిక జీవితంలో ఒడిదుడుకోలు ఎదుర్కొన్నట్లు సమాచారం.
ప్రెటా గిల్ వ్యక్తిగత జీవితం..
వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 1994లో వొటావియో ముల్లర్ అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది. ఇక 1995లోనే అతనితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2015లో రోడ్రిగో గోడోయ్ అనే వ్యక్తితో వివాహం జరగగా.. 2023లో అతడి నుండి కూడా ఈమె విడాకులు తీసుకుంది. అలా వైవాహిక జీవితంలో రెండుసార్లు విఫలమైన ఈమె ప్రస్తుతం ఒంటరిగానే జీవిస్తూ.. ఇప్పుడు తుది శ్వాస విడిచింది.
also read:Bharath Srinivasan: ‘బాయ్స్’ మూవీ హీరో గుర్తున్నాడా.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?