Air India plane crash: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి గల కారణాలు, మీడియా నివేదికలపై నోరు విప్పారు కేంద్రం పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో-AAIB దర్యాప్తు పారదర్శకంగా చేస్తోందన్నారు. తుది నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ఈ విషయంలో విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందన్నారు.
సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంపై రాజ్యసభ లో చర్చ జరిగింది. దీనిపై విపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వివరణ ఇచ్చారు. జరిగిన ప్రమాదంపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందన్నారు.
ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వచ్చిందని, ప్రస్తుతం దాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దీనిపై తుది నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్విస్టిగేషన్ బ్యూరో-AAIB దర్యాప్తు చేస్తోందన్నారు.
ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని, ఇలాంటి సమయంలో సొంత అభిప్రాయాలు చెప్పకూడదన్నారు. విమాన ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో నిబంధనల ప్రకారమే దర్యాప్తు జరుగుతుందన్నారు. అంతర్జాతీయ ప్రోటోకాల్‌కు అనుగుణంగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
ALSO READ: ఆధార్ చల్లని కబురు.. ఇక పిల్లల సమస్యకు చెక్
ఘటనలో తాము నిజం వైపు నిలబడాలని కోరుకుంటున్నట్లు సభలో తెలిపారు సదరు మంత్రి. విమానంలో బ్లాక్ బాక్స్‌ల నుంచి డేటాను సేకరించామన్నారు. ప్రమాద సమయంలో విమానంలో ఏం జరిగిందన్నది తుది నివేదిక తర్వాత తెలుస్తుందన్నారు. అప్పటివరకు దర్యాప్తు ప్రక్రియను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు.
ప్రభుత్వం ప్రమాద బాధితుల మధ్య తేడాను చూడలేదన్నారు. ప్రయాణీకులు- మరణించిన వైద్య విద్యార్థులు సహా ఇతరులకు పరిహారం ఒకేలా ఉంటుందన్నారు. జూన్ 12న అహ్మదాబాద్ నుండి గాట్విక్‌కు 242 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ భవనంపైకి కూలిపోయింది. ఈ ఘటనలో 260 మంది మరణించారు. ఓ ప్రయాణీకుడు స్వల్ప గాయాలతో బయటపడిన విషయం తెల్సిందే. ఘటన జరిగి నెల తర్వాత AAIB తన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోంది: రామ్మోహన్ నాయుడు
ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదికను పరిశీలిస్తున్నాం
తుది నివేదిక వచ్చాకే మరిన్ని పూర్తి వివరాలు తెలుస్తాయి
భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం
ఈ ప్రమాదంపై… pic.twitter.com/RbVxia7XcL
— BIG TV Breaking News (@bigtvtelugu) July 21, 2025