Bharath Srinivasan:కొంతమంది నటీనటులు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్లు నటించిన కొన్ని సినిమాలు ప్రేక్షకాధరణ పొంది ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అంతేకాదు వారు ఏ సినిమాతో అయితే ఫేమస్ అయ్యారో.. ఆ సినిమా పేరుతోనే వాళ్లను పిలుస్తూ ఉంటారు. అయితే అలాంటి ఒక హీరో గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ హీరో ఎవరో కాదు బాయ్స్, ప్రేమిస్తే వంటి సినిమాల్లో హీరోగా నటించి ఫేమస్ అయ్యారు భరత్ శ్రీనివాసన్(Bharath Srinivasan)..
ప్రేమిస్తే సినిమాతో గుర్తింపు..
తమిళ మూవీ కాదల్ (Kaadhal) సినిమా ఎంత ఫేమస్ అయిందో చెప్పనక్కర్లేదు. అయితే ఇదే సినిమా తెలుగులో ప్రేమిస్తే (Premisthe) అనే టైటిల్ తో రీమేక్ అయింది. ఇక ఈ సినిమా యూత్ ని ఆకట్టుకోవడంతో పాటు ఇందులో నటించిన భరత్ శ్రీనివాస్,సంధ్యా (Sandhya) ల పాత్రలకు కూడా మంచి గుర్తింపు లభించింది. అలా ఈ సినిమా వచ్చి 20 ఏళ్ళు దాటినా కూడా ఇంకా ఈ సినిమా పేరుతోనే ఇందులో నటించిన నటీనటులను గుర్తు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అలా ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో పాపులర్ అయినటువంటి నటుడు భరత్ శ్రీనివాసన్ ఈ సినిమా కంటే ముందే శంకర్ (Shankar) డైరెక్షన్లో బాయ్స్(Boys) అనే సినిమాలో చేశారు. అయితే ఈ సినిమా ఐదుగురు హీరోలలో ఒకరిగా చేశారు.కానీ ప్రేమిస్తే సినిమాతో ఈయనకు సోలో హీరోగా గుర్తింపు వచ్చింది.
భరత శ్రీనివాసన్ ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..?
అయితే అలాంటి భరత్ శ్రీనివాసన్ ప్రస్తుతం ఏం చేస్తున్నారో చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఈయన తెలుగు సినిమాల కంటే ఎక్కువగా తమిళంలోనే బిజీగా ఉన్నారు. అలా తమిళంలో కొన్ని సినిమాలు చేస్తూ తెలుగులో అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నారు. ఇక తెలుగులో ఈయన మహేష్ బాబు(Mahesh Babu) నటించిన స్పైడర్ (Spyder)సినిమాలో కూడా నటించారు. ఇక ఎక్కువగా మలయాళం, తమిళ సినిమాల్లో బిజీగా ఉన్న భరత్ కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించారు. అయితే హీరో భరత్ శ్రీనివాసన్ పుట్టినరోజు ఈ రోజు కావడంతో ఆయనకు సంబంధించి కొన్ని విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి. భరత్ శ్రీనివాసన్ ప్రస్తుతం తన 41వ పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకుంటున్నారు..
భరత్ శ్రీనివాసన్ అప్ కమింగ్ సినిమాలు..
ఇక భరత్ శ్రీనివాసన్ అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే..ఆయన ప్రస్తుతం కాళిదాసు 2(Kaalidas-2) మూవీ తో పాటు, మురసు (Murasu), మున్నారివాన్ (Munnarivaan) అనే తమిళ సినిమాలతో పాటు మొనగాడు (Monagadu) అనే తెలుగు సినిమాలో కూడా చేస్తున్నారు.ఈ సినిమాలన్నీ ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆయన కాళిదాసు -2 చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు.
also read:Ram Charan Peddi : పెద్ది ట్రాన్స్‌పర్మేషన్… ఈ బాడీతో బాక్సాఫీస్ బద్దలు కొడతాడా ?