Rinku Singh : టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్.. సమాజ్ వాద్ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ కి ఇటీవలే ఎంగేజ్ మెంట్ అయిన విషయం తెలిసిందే. అయితే వీరి పెళ్లి నవంబర్ 18న వారణాసిలోని తాజ్ హోటల్ లో జరగాల్సి ఉంది. కానీ ఊహించని కారణంతో వీరి పెళ్లి వాయిదా పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రింకూ సింగ్ – ప్రియా సరోజ్ కి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోను చూసి నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. రింకూ సింగ్ ను కుక్కలా తిప్పించుకుంది కాబోయే పెళ్లాం అని.. రోడ్ల పై ఇలా తిరుగుతున్నారేంటి అని రకరకాలు కామెంట్స్ చేయడం విశేషం. పెళ్లి వాయిదా పడిందనుకున్న సమయంలో వీరి ఫొటోలు కనిపించడం గమనార్హం.
Also Read : MS Dhoni : సాక్షికి ఇంత పొగరా… ధోనితో కాళ్లు మొక్కించుకొని మరీ!
2026 ఐపీఎల్ తరువాతే..
ముఖ్యంగా రింకూ సింగ్ నవంబర్ నెలలో దేశీయ క్రికెట్ లో చాలా బిజీగా ఉంటారని.. అందుకే పెళ్లి వాయిదా పడిందని.. త్వరలోనే పెళ్లి తేదీని నిర్ణయిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు 2026 ఐపీఎల్ తరువాత పెళ్లి తేదీని నిర్ణయించే అవకాశం ఉందని మరికొందరూ చెప్పడం విశేషం. ప్రియా సరోజ్ మచ్లిషహర్ స్థానం నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవలే ప్రియా సరోజ్-రింకూ సింగ్ లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 18న పెళ్లి జరుగుతుందని.. హోటల్ లోని అతిథుల కోసం గదులు కూడా బుక్ చేశారట. రింకూ సింగ్ అక్టోబర్, ఫిబ్రవరి మధ్య రాష్ట్ర జట్టు తరుపున దేశీయ క్రికెట్ ఆడుతున్నాడు. తరువాత కొద్ది రోజులకు ఐపీఎల్ ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి చివరిలో అతనికి ఆట నుంచి సమయం దొరికినప్పుడు.. ఐపీఎల్ 2026 తరువాత వివాహ తేదీని నిర్ణయిస్తారని ఇరు కుటుంబాలు తెలిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
సౌతాఫ్రికా పర్యటనే కారణమా..?
మరో వైపు రెండు కుటుంబాలు కూడా పెళ్లి వారణాసిలో కాకుండా వేరే ప్రదేశంలో జరిపించాలని.. ఇధి డెస్టినేషన్ వెడ్డింగ్ అని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కి ప్రాతినిధ్యం వహిస్తూ వెలుగులోకి వచ్చాడు రింకూ సింగ్. ఉత్తరప్రదేశ్ కి చెందిన రింకూ సింగ్ ఐపీఎల్ అద్భుతంగా తన ప్రదర్శన కనబరిచి టీమిండియా సెలెక్టర్ల దృష్టినీ ఆకర్షించాడు. ఆ తరువాత 2023లో ఐర్లాండ్ తో టీ-20 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు రింకూ సింగ్. 2023లో టీమిండియా తరపున వన్డేల్లో ఆరంగేట్రం చేశాడు. మరోవైపు ప్రియా సరోజ్ అతిపిన్న వయస్కురాలైన ఎంపీ. ఆమె 25 ఏళ్లకే లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పని చేసారు. ఇక రింకూ సింగ్ 2025 ఐపీఎల్ లో పెద్దగా రాణించలేదు. 29.42 యావరేజ్ తో కేవలం 206 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 19 వరకు టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అందుకే పెళ్లి వాయిదా వేసి.. వచ్చే సంవత్సరం చేసుకోనున్నట్టు సమాచారం.
https://www.facebook.com/share/p/19kYLSMZ87/