Actor Death..గత కొన్ని నెలలుగా సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతోందో తెలియదు కానీ వరుస విషాదాలు అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఒకరి తరువాత ఒకరి మరణం సినీ ఇండస్ట్రీని కూడా దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ముఖ్యంగా కొంతమంది సీనియర్ నటీనటులు వృద్ధాప్యరీత్యా కన్నుమూస్తే.. మరికొంతమంది అనారోగ్య సమస్యలతో కన్ను మూస్తున్నారు. ఇంకొంతమంది వివిధ కారణాలవల్ల మరణిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక హాలీవుడ్ దిగ్గజ నటుడు తుదిశ్వాస విడిచారు. ఈ విషయం ఆయన అభిమానులకు మరింత దుఃఖాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు.
ప్రముఖ సినీ నటుడు కన్నుమూత..
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ బ్రిటిష్ నటుడు టెరెన్స్ స్టాంప్ కన్నుమూశారు. లండన్ లో జన్మించిన ఈయన తన సినీ జీవితాన్ని 1962లో ప్రారంభించారు.. 1962లో వచ్చిన సముద్రయాన చిత్రం ‘బిల్లీ బడ్’ అనే సినిమాలో నటించారు ఆ తర్వాత 1978లో వచ్చిన ‘సూపర్ మ్యాన్ కి సినిమాలో గడ్డం ఉన్న జోడ్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రజాదారణ పొందిన ఈయన 2021లో వచ్చిన ‘లాస్ట్ నైట్ ఇన్ సోహో’ చిత్రంలో చివరిసారిగా నటించారు. ఈయన మరణ వార్త విని అటు సినీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈయన వయసు 87 సంవత్సరాలు కావడం గమనార్హం. మరి ఈయన మరణానికి అసలు కారణం ఏంటో ఇప్పటికీ తెలియదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.