Raghava lawrance : డ్యాన్సర్, కోరియోగ్రాఫర్, నిర్మాత, డైరెక్టర్, హీరో రాఘవ లారెన్స్ తెలుగు ప్రేక్షకులకు సుపరచితమే. తెలుగులో ఈయన కొన్ని సినిమాలు చేశాడు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఈయన ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సాయం కోరిన వారికి లేదనకుండా తోచిన సాయాన్ని అందిస్తూ రియల్ హీరోగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు.. ఒక ఫౌండేషన్ ని స్థాపించి అందులో ఎంతో మందికి అండగా నిలిచారు. ఇప్పటికీ ఎంతోమందికి అయినా సాయం చేసి మనసున్న మహారాజుగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా లారెన్స్ తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
కన్నీళ్లు తెప్పిస్తున్న లారెన్స్ పోస్ట్..
హీరో రాఘవ లారెన్స్ సూర్య అరగం ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది హీరోలు ప్రజలకు సాయం చేస్తున్నారు. అదే బాటలో మరో స్టార్ హీరో రాఘవ లారెన్స్ కూడా ప్రజలకు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో వందల మందికి ఆయన సాయం చేశారు. ఎక్కడా ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే స్పందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మాత్రం ఫౌండేషన్ ను స్థాపించి వందల మంది జీవితాల్లో వెలుగు నింపారు. తాజాగా ఓ నిరుపేద కుటుంబంలో ఓ పెరిగిన విద్యార్థి బాధని చూసి చలించిపోయారు లారెన్స్.. ఆ విద్యార్థికి తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేశారు..
ఆ పోస్ట్ లో.. ఆ పోస్టులో ఓ తండ్రి చనిపోయిన తన భార్య మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టడం తనకు బాధగా అనిపించిందని రాఘవ అంటున్నారు. నా కుటుంబం కూడా ఒకప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది అని లారెన్స్ ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఆ మంగళసూత్రాన్ని విడిపించి అతనికి తిరిగి మళ్లీ ఇచ్చినట్లు రాఘవ ట్వీట్ లో పేర్కొన్నారు. అతని భార్య చనిపోయింది. ఆమె గుర్తుగా మిగిలిన జ్ఞాపకాన్ని అతనికి తిరిగి ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.. నా హృదయం నిండిపోయింది అని లారెన్స్ ట్వీట్ చేశారు.. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో ఆయన అభిమానులు లారెన్స్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఒక మనిషికి జీవితాంతం గుర్తుండే వస్తువును తిరిగి ఇవ్వడం పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది..
Also Read: వీకెండ్ దారుణంగా పడిపోయిన కూలీ కలెక్షన్స్.. ఇలా అయితే కష్టమే లోకీ..!
సినిమాల విషయానికొస్తే..
తమిళ హీరో రాఘవ లారెన్స్ ప్రస్తుతం కాంచన 4 లో నటిస్తున్నారు.. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలోనూ.. లేదా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. వీటితో పాటుగా కొన్ని సినిమాల కథలను విన్నట్లు తెలుస్తుంది. అందులో ఆయనకు ఓ స్టోరీ నచ్చిందట.. త్వరలోనే దీనిని అధికారికంగా ప్రకటించనున్నారు.
Hi everyone! I came across a story about a father who had pawned his late wife’s thali to pay for his daughter’s education. This touched me deeply, because my own family once went through a similar struggle.
Through Maatram, i was able to retrieve the thali and return it to… pic.twitter.com/25VMi8fRHS
— Raghava Lawrence (@offl_Lawrence) August 17, 2025