Kota Srinivasa Rao:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజ లెజెండ్రీ నటుడిగా పేరు సొంతం చేసుకున్న కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) మరణించిన నెల రోజుల్లోనే ఆయన భార్య రుక్మిణి (Rukhmini ) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాదులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు మీడియాతో వెల్లడించినట్లు సమాచారం. ఇకపోతే కోటా శ్రీనివాసరావు వృద్ధాప్య కారణాలవల్ల జూలై 13 వ తేదీన తుది శ్వాస విడిచారు. భర్త మరణించిన నెల రోజులకే రుక్మిణి కూడా మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా అభిమానులు ఈ విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు. అటు సినీ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రుక్మిణి అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు అని వార్తలు వస్తున్నాయి కానీ.. ఆమె ఎలాంటి అనారోగ్య సమస్యతో కన్నుమూశారు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఆమె మరణ వార్త సినీ ఇండస్ట్రీని దుఃఖంలో ముంచేసింది. మొత్తానికి నెల రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ కన్నుమూయడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.
కొడుకు మరణంతో కృంగిపోయిన భార్యాభర్తలు..
నిజానికి కోటా శ్రీనివాసరావు వరుస సినిమాలలో నటిస్తున్నప్పుడే.. తన కొడుకు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ 2010లో హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో జూన్ 20న మరణించారు. కొడుకు మరణంతో భార్యాభర్తలిద్దరూ కోలుకోలేకపోయారు. కన్న బిడ్డని తలుచుకుంటూ ఎమోషనల్ అయిపోయారు. ఒకరకంగా చెప్పాలి అంటే కోటా శ్రీనివాసరావు అనారోగ్య బారిన పడడానికి కూడా కొడుకు మరణమే అని చెప్పవచ్చు. కొడుకులేని లోటును ఎవరు తీర్చలేనిది అని ఎప్పటికప్పుడు తన కొడుకుని తలుచుకుంటూ ఎమోషనల్ అయిపోయేవారు ఈ భార్యాభర్తలు. కోటా వెంకట ఆంజనేయ ప్రసాద్ జెడి చక్రవర్తి చిత్రం ‘సిద్ధం’ సినిమాతో పాటు తన తండ్రితో కలిసి ‘గాయం 2’ సినిమాలో కూడా నటించారు.
కోట కుటుంబ సభ్యులకు ఈ మూడు మాసాలు కలిసి రాలేదా..?
ఇకపోతే ఇక్కడ అనుమానం రేకెత్తించే విషయం ఏమిటంటే.. 2010లో జూన్ 20న కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ మరణిస్తే.. 2025 జూలై 13 వ తేదీన లెజెండ్రీ దిగ్గజ నటులు కోటా శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారు. ఇక 2025 ఆగస్టు 18న కోటా శ్రీనివాసరావు భార్య రుక్మిణరావు తుది శ్వాస విడిచారు. ఇక దీన్ని బట్టి చూస్తే ఈ మూడు మాసాలు ఈ కుటుంబ సభ్యులకు కలసి రాలేదేమో అని అభిమానులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఇటు భార్యాభర్తలిద్దరూ నెల రోజుల్లోనే కన్నుమూయడం బాధాకరమని చెప్పవచ్చు.
కోట శ్రీనివాసరావు చివరి సినిమా..
వయోభారంతో ఇంటికే పరిమితమైన కోట శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ సహాయంతో ఆయన నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో కీలకపాత్ర పోషించారు. అయితే ఈ సినిమా కోట శ్రీనివాస్ రావు మరణించిన తర్వాత విడుదల అయ్యింది. ఇందులో నటించినందుకుగాను ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
ALSO READ:V.N.Adithya: సినీ సమ్మెపై డైరెక్టర్ హెచ్చరిక.. మాట వినకపోతే అడుక్కు తింటారంటూ!