E-Paper
Advertisement

Akhanda 2: దుబాయ్‌ లో అఖండ 2 సినిమాకి అడ్డు, ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది

Akhanda 2: దుబాయ్‌ లో అఖండ 2 సినిమాకి అడ్డు, ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది
Advertisement

Akhanda 2: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాబోతున్న సినిమాలలో అఖండ 2 సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా మీద అంచనాలు క్రియేట్ అవ్వడానికి కారణం బోయపాటి శ్రీను మరియు బాలకృష్ణ కాంబినేషన్. ఇప్పటివరకు వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు కూడా విపరీతమైన సక్సెస్ సాధించాయి. అఖండ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు వస్తున్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా విపరీతంగా చేస్తున్నారు.

ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన ప్రతి కంటెంట్ కూడా అంచనాలను పెంచుతుంది. ఈ సినిమాకి సంబంధించి రెండు టీజర్లు విడుదల చేశారు. అలానే ఒక ట్రైలర్ విడుదల చేశారు. ఇవన్నీ కూడా ఫ్యాన్స్ కి మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయి. అలానే పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి దుబాయిలో అడ్డంకులు ఎదురవుతున్నాయి.

దుబాయ్ లో అడ్డంకులు 

Advertisement

ఈ సినిమాకి తెలుగులో యు అండ్ ఏ సర్టిఫికెట్ వచ్చింది. మొత్తానికి ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి చెప్పబోతున్నట్లు వీడియో కంటెంట్ చూస్తే అర్థమవుతుంది. అలానే పలు రకాల స్పీచెస్ లో కూడా ఇదే విషయాన్ని బోయపాటి శ్రీను మరియు బాలకృష్ణ బయటికి చెప్పారు.

ఇక ప్రస్తుతం దుబాయ్ లో ఈ సినిమాకి సెన్సార్ అడ్డంకులు వస్తున్నట్లు తెలుస్తోంది. చైనా వాళ్లను విలన్స్ గా చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశాన్ని కాపాడేది సైన్యం కాదు., సాధువులు అనే దానిపై కూడా అక్కడి సెన్సార్ అభ్యంతరం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ తప్పు చేయకుండా ఉండాల్సిందే 

Advertisement

ఈరోజుల్లో మనోభావాలనేవి చాలా ఈజీగా దెబ్బతింటున్నాయి. కొన్ని డైలాగులు రాస్తున్న తరుణంలో కూడా ఒకటికి వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడైతే సినిమాలు అనిపించింది అనిపించినట్లు తీయడానికి కూడా విపరీతమైన స్వేచ్ఛ ఉండేది. ఈ రోజుల్లో అది పోయింది. ఒక చిన్న పదానికి కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ముందుకు వచ్చే అనేక వర్గాలు ఉన్నాయి.

అయితే సాధువులని బాగా చూపించే క్రమంలో సైనికులను తక్కువ చేయటం అనేది ఈ సినిమాకి అడ్డంకుగా మారింది. అలాంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉండుంటే ఈ సినిమాకి కూడా సేఫ్ గా దుబాయిలో సెన్సార్ జరిగిపోయేది.

Also Read : Drishyam 3 : థియేటర్ హక్కులకు 350 కోట్లా? బాలీవుడ్ సినిమాకు ధీటుగా నిలబడుతుందా?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×