CM Chandrababu: మన జీవితంలో మొదటిసారి కొనుగోలు చేసిన వస్తువులను ఎప్పటికీ మర్చిపోం. మొదటి బైక్, ఫోన్, కారు.. ఇలా ఎంతో కష్టపడి కొనుగోలు చేసిన వస్తువులను అపురూపంగా చూసుకుంటాం. ఆ వస్తువులు పాతవైపోయినా, పనిచేయకపోయినా, వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకుంటాం. సీఎం చంద్రబాబుకు కూడా ఒక వాహనాన్ని అలాగే భద్రపరుచుకున్నారు. ఆ అపురూప జ్ఞాపకాన్ని సీఎం చంద్రబాబు మరోసారి గుర్తు చేసుకున్నారు.
మూడు దశాబ్దాల క్రితం సీఎం చంద్రబాబు ఉపయోగించిన పాత 393 నెంబర్ అంబాసిడర్ కారు తాజాగా వైరల్‌గా అవుతుంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో అంబాసిడర్ కారును పరిశీలించిన సీఎం చంద్రబాబు, ఆ కారుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన పర్యటనల స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు 393 నెంబర్ అంబాసిడర్ కారుతో విస్తృతంగా పర్యటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కారును అపురూపంగా భద్రపరిచారు. ఈ కారును చూసిన చంద్రబాబు పాత స్మృతులను గుర్తుచేసుకున్నారు. అంబాసిడర్ తో ఉన్న ఫొటోలను సీఎం చంద్రబాబు ఎక్స్ లో పోస్టు చేశారు. సీఎం చంద్రబాబు తన సొంత వాహనమైన పాత అంబాసిడర్‌ను ఇప్పటికీ ఎంతో ప్రేమిస్తున్నారని నెటిజన్లు అంటున్నారు.
….. with my old friend! pic.twitter.com/VJbB9keeE3
— N Chandrababu Naidu (@ncbn) October 31, 2025
ఏపీ 09 జీ 393 నెంబరుతో ఉన్న ఈ అంబాసిడర్ కారు చంద్రబాబు సొంత వాహనం. ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉన్న కారును ఇకపై అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉంచనున్నారు. ప్రస్తుతం భద్రతాపరంగా అధునాతన వాహనాలను వినియోగిస్తున్న చంద్రబాబు.. పాత అంబాసిడర్ కారును గుర్తుచేసుకున్నారు.