Chandoo Mondeti : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ లో చందు మొండేటి ఒకరు. కార్తికేయ (karthikeya) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడు ఎంట్రీ ఇచ్చాడు చందు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత మలయాళం సూపర్ హిట్ సినిమా ప్రేమమ్ (premam) రీమేక్ చేశారు. తెలుగులో కూడా ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ లభించింది. మైత్రి మూవీ మేకర్స్ (Mytri movie makers) నిర్మించిన సవ్యసాచి (Savyasachi) సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది. చందు దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.
మొత్తానికి కార్తికేయ సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 (karthikeya 2) సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు పొందుకున్నాడు చందు. చందు సినిమాల్లో కొంత ప్రత్యేకత ఉంటుంది. ఆడపిల్లలను చందు ఎక్కువగా రెస్పెక్ట్ చేస్తాడు. తనక్కూడా ఒక ఆడపిల్ల పుడితే బాగున్ను అనే కోరిక కూడా చందుకి ఎక్కువగా ఉండేదట. కానీ చందుకి ఇద్దరు మగ పిల్లలు.
చందు మొండేటి దర్శకుడు కాకముందు, ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు చాలా ఈజీగా డబ్బులు అడిగేసేవాడు అంట. అదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చందు చెప్పాడు. “నేను చాలా ఈజీగా డబ్బులు అడిగేస్తాను, చాలా ఈజీగా డబ్బులు ఖర్చు పెట్టేస్తాను. అడగడానికి మొహమాట పడను, ఇవ్వడానికి వెనకాడను. దానివలన చాలాసార్లు రెస్పెక్ట్ పోతది. ఊరికనే డబ్బులు అడిగితే అది కూడా నేను ఉన్న పొజిషన్ కి, ఉంటే డబ్బులు ఇవ్వచ్చు కదా ఒక 2000, 3000.
అదేంటో ఆ టైంకి ఇచ్చేస్తానని కాన్ఫిడెన్స్. ఇలా అడగడం తగ్గించింది మా వైఫ్ సుజిత. మా నాన్నగారు కూడా ఆపలేకపోయారు అలా అడగడాన్ని. అవతల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే నువ్వు చులకన అయిపోతావ్ నీ క్యారెక్టర్ పడిపోతుంది. ఫ్రెండ్షిప్ కూడా కట్ అయిపోతుంది. సో నీకేమైనా ఉంటే చెప్పు ఐ విల్ టేక్ కేర్ అంటూ మా వైఫ్ చెప్పింది.
ఎవరికైనా కొంతమేరకు మాత్రమే కొంతమంది హెల్ప్ చేస్తారు. ఆ తర్వాత వాళ్లు కూడా ఇచ్చిన డబ్బులు తిరిగి అడగడం ఖచ్చితంగా జరుగుతుంది. చందు మొండేటి విషయంలో కూడా అదే జరిగింది. ఈ విషయం ఏకంగా వాళ్ళ నాన్న వరకు వెళ్ళింది. అయితే ఒక తరుణంలో చందు ఎవరెవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నాడో వాళ్ళందర్నీ క్యూలో నిలిచిన వ్యక్తి, వాళ్ళ ఫాదర్ చందు చేసిన అప్పులను తీర్చారట. ఈ విషయాన్ని స్వయంగా చందు ఒక ఇంటర్వ్యూలో గతంలో చెప్పారు.
ఇక చందు లాస్ట్ ఫిలిం తండేల్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిన చందు నేడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు సాధించాడు. ఇంకా మరిన్ని సక్సెస్ లు సాధించి కెరియర్ లో ముందుకు వెళ్లాలని కోరుకుంటూ చందు మొండేటి కి బిగ్ టీవీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.