BigTV English
Advertisement

Prabhas @23 Years : అది బాడీ కాదురా… బాక్సాఫీస్.. 23 ఏళ్లల్లో ఎన్ని వేల కోట్లు అంటే ?

Prabhas @23 Years : అది బాడీ కాదురా… బాక్సాఫీస్.. 23 ఏళ్లల్లో ఎన్ని వేల కోట్లు అంటే ?

Prabhas @23 Years : అది బాడీ కాదురా… బాక్సాఫీస్.. ప్రభాస్‌ను ఉద్దేశించి దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి చెప్పిన మాట ఇది. ఛత్రపతి సినిమాలో ప్రభాస్‌పై జీవ చేత ఆ డైలాగ్ చెప్పిస్తాడు జక్కన్న. 20 ఏళ్ల క్రితమే ప్రభాస్ పాన్ ఇండియా హీరో అవుతాడని, అతని బాడీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుందని అంచనా వేసి.. ఆ డైలాగ్ పెట్టినట్టు ఉంది. ప్రభాస్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నేటికి 23 ఏళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఈ 23 ఏళ్ల కెరియర్‌లో బాక్సాఫీస్ వద్ద ఎన్ని వేల కోట్లను కొల్లగొట్టాడో ఈ ఆర్టికల్ లో చూద్దాం.


 

ప్రభాస్ సినీ ప్రస్థానం..

ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ సూర్య రాజుగా 1979 అక్టోబర్ 23న జన్మించారు ప్రభాస్. 2002లో ఈశ్వర్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఈయన.. యాక్షన్ రొమాంటిక్ చిత్రం వర్షంతో తన నటనలోని పురోగతిని సాధించి.. అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత చత్రపతి , బుజ్జిగాడు, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి అంటూ కమర్షియల్ సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా తన చిత్రాలతో ఏడు ఫిలిం ఫేర్ అవార్డులకు నామినేషన్లు అందుకోవడమే కాకుండా నంది అవార్డుతో పాటు సైమా అవార్డు కూడా అందుకున్నారు ప్రభాస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి: ది బిగినింగ్ అలాగే బాహుబలి: ది కంక్లూజన్ చిత్రాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయారు ప్రభాస్. ఆ తర్వాత సలార్, ఆది పురుష్ , కల్కి అంటూ వరుస సినిమాలు చేస్తూ తన మార్కెట్ ను పెంచుకోవడమే కాకుండా ఈ సినిమాలతో భారీ కలెక్షన్లు వసూలు చేశారు.


చిత్రాలు.. వాటి కలెక్షన్స్..

ఇకపోతే ప్రభాస్ నటించిన సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద అవి సాధించిన కలెక్షన్ల విషయానికి వస్తే..ఈశ్వర్.. 2002లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద 2 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర 2003లో విడుదలయ్యి 2 కోట్లు రాబట్టింది. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడం గమనార్హం. ఆ తర్వాత తన నటనలోని మెలుకువలను తెలుసుకొని.. 2004లో వచ్చిన వర్షం సినిమాతో ఏకంగా 34.8 కోట్లు రాబట్టి తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

అడవి రాముడు – 2004 – 27.8 కోట్లు

చక్రం – 2005 – 10 కోట్లు

చత్రపతి – 2005 – 28 కోట్లు

పౌర్ణమి – 2006 – 17 కోట్లు

యోగి – 2007 – 25 కోట్లు

మున్నా – 2007 – 10 కోట్లు

బుజ్జిగాడు – 2008 – 18.9 కోట్లు

బిల్లా – 2009 – 34.8 కోట్లు

ఏక్ నిరంజన్ – 2009 – 14కోట్లు

డార్లింగ్ – 2010 – 55 కోట్లు

మిస్టర్ పర్ఫెక్ట్ – 2011 – 83.4 కోట్లు..

రెబల్ – 2012 – 44 కోట్లు

మిర్చి – 2013 – 82.1 కోట్లు

బాహుబలి: ది బిగినింగ్ – 2015 – 600 కోట్లు

బాహుబలి 2: ది కన్‌క్లూజన్ – 2017 – 1810 కోట్లు

సాహో – 2019 – 419 కోట్లు

రాధే శ్యామ్ – 2022 – 149.5 కోట్లు

ఆదిపురుష్ – 2023 – 393 కోట్లు

సాలార్: పార్ట్ 1 – 2023 – 705.59 కోట్లు

కల్కి 2898 ఏడి – 2024 – 1054.67 కోట్లు

ఇలా తన 23 ఏళ్ల సినీ కెరియర్లో ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద తన చిత్రాలతో రూ.5,620.9 కోట్లు రాబట్టాడు. ఇకపోతే ఈ రికార్డు ఇప్పటివరకు టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు ఏ హీరోకి దక్కలేదు అని చెప్పడంలో సందేహం లేదు.

also read:Hero Dharmendra: యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ప్రేక్షకులు అందించిన బిరుదులేంటో తెలుసా?

ప్రభాస్ నుండీ రాబోయే చిత్రాలు..

ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రాలతో పాటు స్పిరిట్, సలార్ 2, కల్కి 2 చిత్రాలు చేస్తున్నారు. ఈ చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసే సత్తా ఉన్న చిత్రాలే కావడం గమనార్హం. ఇక ఈ కలెక్షన్లను బట్టి చూస్తే రాజమౌళి ముందే ప్రభాస్ గురించి ఆలోచించి ప్రభాస్ బాడీ కాదు.. బాక్స్ ఆఫీస్ అంటూ కామెంట్లు చేశారని ఇప్పుడు అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు.

Related News

Rashmika Mandanna: మనసులో కోరిక బయట పెట్టిన రష్మిక.. సాధిస్తుందా?

Jackie Chan: జాకీ చాన్ మరణం పై వార్తలు.. బ్రతికుండగానే చంపేస్తున్న సోషల్ మీడియా!

Ram charan: మెగా ఫ్యాన్స్ కు షాక్ .. సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న చరణ్.. ఈ ప్రాజెక్ట్‌లపై ఎఫెక్ట్ ?

Rashmika -Vijay: ఎంగేజ్మెంట్ తర్వాత ఒకే స్టేజ్‌పైకి విజయ్ – రష్మిక… గుడ్ న్యూస్ లోడింగా ?

Hero Dharmendra: యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ప్రేక్షకులు అందించిన బిరుదులేంటో తెలుసా?

Tamannaah Bhatia: స్లిమ్ గా కనిపించడం కోసం ఇంజక్షన్స్.. తమన్నా గ్లామర్ సీక్రెట్ ఇదేనా?

Hero Dharmendra: చనిపోకముందే చంపేశారు.. ధర్మేంద్రకు ఇది మొదటిసారి కాదు

Big Stories

×