Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో దారణమైన ఘటన చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన ఓ లారీ డ్రైవర్ జాతీయ రహదారి మీదుగా ఒడిశా నుండి విశాఖపట్నం వెలుతున్నాడు. భోజనం కోసం ఓ దాబా దగ్గర ఆగాడు. భోజనం చేశాక యాజమాని బిల్లు కట్టమన్నాడు. ఫుడ్ బాలేదని బిల్లు కట్టకుండా వెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మెుదలైంది.ఈ క్రమంలో డ్రైవర్ నేరుగా లారీ ఎక్కేందుకు ప్రయత్నించాడు. దీనికి దాబా యాజమాని అడ్డుగా వచ్చాడు. దీంతో డ్రైవర్ లారీని యాజమాని పైనుంచి వెళ్లించడంతో యజమాని స్పాట్ లోనే మరణించాడు. ప్రమాదాన్ని ఆపేందుకు వచ్చిన మరో వ్యక్తిని కూడా ఢీకొట్టడంతో తీవ్రంగా రక్త స్రావమై అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.