Idli Kadai : కొంతమందికి మల్టీ టాలెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్ అంతా కూడా తమ టాలెంట్ చూపిస్తున్నారు. కిరణ్ అబ్బవరం, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్, అడవి శేష్ వంటి హీరోలు కేవలం నటించడం మాత్రమే కాకుండా స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ కూడా అయ్యి పర్ఫెక్ట్ గా వచ్చేలా ప్లాన్ చేస్తుంటారు. విశ్వక్సేన్ అయితే దర్శకుడుగా కూడా మంచి సక్సెస్ అయిపోయాడు.
అలా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది మల్టీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. ముఖ్యంగా అందరినీ మించి ధనుష్ ఒక మెట్టు ఎక్కువగా ఉంటారని చెప్పాలి. ధనుష్ అద్భుతంగా రాస్తాడు, అద్భుతంగా పాడుతాడు, అలానే అద్భుతమైన సినిమాలు కూడా తీయగలడు అని నిరూపించుకున్నాడు.
ఒక ప్రస్తుతం ధనుష్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇడ్లీ కడాయి. ఈ సినిమా తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాని అనూప్య రీతిలో ప్రమోట్ చేస్తుంది చిత్ర యూనిట్. ఈ సినిమా యూనిట్ జిప్టో వాళ్లతో కొలాబరేషన్ అయింది.
జిప్టో లో ఏవైనా ఆర్డర్ పెట్టుకుంటే ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఇడ్లీ కడాయి సినిమాకు సంబంధించిన పోస్టర్ మరియు రిలీజ్ డేట్ ఉన్న ఒక బ్యాగ్ తో డెలివరీ ఇస్తారు. ఖచ్చితంగా ఇలా ఇవ్వడం ద్వారా సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. బ్యాగ్ పైన ఉన్న స్కానర్ స్కాన్ చేస్తే సినిమా టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు.
ఇక తెలుగు సినిమాల ప్రమోషన్స్ విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్ లో లిటిల్ హార్ట్స్ టీం వాళ్ల సినిమాను కొంచెం డిఫరెంట్ గా ప్రమోట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం చాలామంది యంగ్ హీరోలు సినిమాలు రిలీజ్ అయితే ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లను పట్టుకోవడం మొదలుపెట్టారు.
ఇంస్టాగ్రామ్ ఇన్సూరెన్స్ లో కూడా వాళ్లకు కొంతమంది ఇస్తే సినిమాకు సంబంధించి కొన్ని రీల్స్ చేస్తారు. ఇలా రీల్ చేయటం వలన సోషల్ మీడియా ఎక్కువగా వాడే వాళ్ళకే సినిమా రీచ్ వెళ్తుంది. జిప్టో లో నిత్యవసర వస్తువులు ఆర్డర్ పెట్టుకుంటారు. అలా ఆర్డర్ పెట్టుకోవడం వలన నిత్యవసర వస్తువులతో పాటు సినిమా కూడా వాళ్ల వద్దకు చేరుతుంది. ఇది సరికొత్త ఆలోచన.
Also Read : Chandoo Mondeti : దారుణంగా అప్పులు చేసిన డైరెక్టర్, అప్పుల వాళ్ళని క్యూలో నిల్చబెట్టి క్లియర్ చేసిన ఫాదర్