E-Paper
Advertisement

Mangli: మంగ్లీ సవాల్‌కు విమర్శకులు సైలెంట్.. ఆ రూ.10 కోట్ల ఆరోపణల వెనుక నిజం ఏమిటీ?

Mangli: మంగ్లీ సవాల్‌కు విమర్శకులు సైలెంట్.. ఆ రూ.10 కోట్ల ఆరోపణల వెనుక నిజం ఏమిటీ?
Advertisement

Mangli: చుట్టూ వ్యతిరేక శక్తులు..ఏ పని చేసినా విమర్శలు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ లు.. నిలబడే ప్రయత్నం చేస్తే అడ్డగింపులు.. ఇదంతా సింగర్ మంగ్లీ, ఏపీ ఎండోమెంట్ అధికారి శాంతి గురించే.. ఇప్పుడు ఈ ఇద్దరి చుట్టూ సొసైటీలో చాలా మంది చాలా రకాలుగా చర్చించుకుంటున్నారు. ఏంటి వీళ్లిద్దరూ చేసిన తప్పు? వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి.. తమను తాము ప్రూవ్ చేసుకుని నిలబడ్డారు. కష్టపడ్డారు. ఒకరు సింగర్ అయ్యారు. మరొకరు గ్రూప్ వన్ జాబర్ అయ్యారు. తమ ట్యాలెంట్ తో గుర్తింపు పొందారు. సొసైటీలో తమకంటూ పేరు తెచ్చుకున్నారు. మరి ఆ ఇద్దరిపై ఎందుకంత ద్వేషం? ఇద్దరి చుట్టూ ఇంత నెగెటివిటీ ఎందుకు? ఒక్కొక్కరి కథను ఇప్పుడు చూద్దాం.

సింగర్‌ మంగ్లీపై కేసు

మంగ్లీ.. ఫేమస్ సింగర్. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడు ఆమె చుట్టూ వివాదాలు… విమర్శలు.. సింగర్‌ మంగ్లీపై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. మైక్రో ఫైనాన్స్‌ పేరిట కొందరిని 10 కోట్ల దాకా మోసం చేశారని.. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని సుబ్బారావు అనే లాయర్ ఆరోపించారు. మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది. ఇందులో నిజానిజాలేంటన్నది పోలీసులు తేలుస్తారు.

మంగ్లీపై విమర్శల వర్షం

Advertisement

సెలబ్రిటీలుగా ఉన్న వారి చుట్టూ చీమ చిటుక్కుమన్నా విమర్శలు పెరుగుతుంటాయ్. మంగ్లీ విషయంలోనూ అదే జరిగింది. ఈ కేసులో ఆమెకు ఎవరితో సంబంధం ఉంది.. పెట్టుబడుల కోసం ప్రచారం చేశారా మరొకటా అన్నది తర్వాతి విషయం. అది పోలీసులు చూసుకుంటారు. కానీ ఈ గ్యాప్ లో మాత్రం ఆమెకు జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది. మంగ్లీపై చీటింగ్ కేసు అని, అదని, ఇదని సోషల్ మీడియాలో ఆమె సెలబ్రిటీ క్రేజ్ ను క్యాష్ చేసుకునేలా రకరకాల వ్యాఖ్యానాలు. రకరకాల రీల్స్… ఇంత దారుణమా?

ఆరోపణలపై మంగ్లీ సవాల్

ఈ మొత్తం వ్యవహారంపై ఆమె ధైర్యంగా మీడియా ముందుకొచ్చారు. తప్పు చేయనప్పుడు భయపడేదే లేదన్నారు. తనపై ఆరోపణలు చేసే వాళ్లు ఆధారాలు చూపగలరా అని సవాల్ చేశారు. ఏవో వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించాలనుకునే ఆశ తనకు లేదన్నారు. తన పాటను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, అది తనకు చాలు అన్నారు. సంబంధం లేని విషయాలను తమపై ఎందుకు రుద్దుతున్నారో అర్థం కావట్లేదన్నారు. ఎక్కడ చూసినా మంగ్లీ.. మంగ్లీ.. అని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారన్నారు. ఆ అడ్వకేట్ కేవలం ఫేమస్ అవ్వడం కోసమే ఇదంతా చేస్తున్నాడని కన్నీళ్లు పెట్టుకున్నారు మంగ్లీ. ఈ కన్నీళ్లు అబద్ధం చెప్పవు అని ఆమెను సపోర్ట్ చేసే వారు అంటున్న మాట.

మంగ్లీ ఏం చేసినా ట్రోలింగేనా?

Advertisement

ఒక్కటి కాదు.. ఎన్నో విమర్శలు.. మంగ్లీ ఏ పని చేసినా.. ఏ కొత్త ప్రయత్నం చేసినా తనకు తెలియకుండానే ఇబ్బందుల్లో పడాల్సి వస్తోంది. ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఇటీవల రథసప్తమి సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శన సమయంలోనూ ఇలాంటి విమర్శలే వచ్చాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు – శ్రావ్య దంపతులతో పాటే సింగర్ మంగ్లీ కూడా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

మంగ్లీపై రాజకీయ రంగు?

మంగ్లీ వైసీపీ సానుభూతిపరురాలని… ఆమెకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రోటోకాల్‌లో దర్శనం ఇప్పించి ఆయన ఏం సందేశం ఇస్తున్నారని టీడీపీ మద్దతుదారులు నాడు క్వశ్చన్ చేశారు. గతంలో మంగ్లీ జగన్ కోసం పాటలు పాడారని.. వైసీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని.. చంద్రబాబు నాయకుడు కోసం పాటలు పాడమంటే పాడనని టీడీపీ వాళ్ల మొహం మీదే చెప్పేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు కొందరు. వాటిపై మంగ్లీ బహిరంగ ప్రకటన కూడా విడుదల చేయాల్సి వచ్చింది. ఏది చేసినా తనపై విష ప్రచారం జరుగుతోందవఫ, ఒక కళాకారిణిగా వాళ్లతోపాటు ఆహ్వానించడం తప్పా అని ప్రశ్నించారామె.

మంగ్లీ స్ట్రాంగ్ స్టేట్‌మెంట్

కళాకారులు చేసే కన్సర్ట్ లకు డబ్బులు వస్తాయి. నిజానికి 2019 ఎన్నికలకు ముందు వైసీపీ చెందిన కొందరు లీడర్లు సంప్రదిస్తే వారికి మంగ్లీ పాట పాడింది. ఆ తర్వాత రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. అక్కడి స్థానిక నేతలు వ్యక్తిగతంగా తెలియడంతో ప్రచారం చేసినా.. ఏ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. జెండా మోయలేదు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పాటు దాదాపు అన్ని పార్టీల లీడర్లకు పాటలు పాడారు. ఈ తరహా వివాదంతో చాలా అవకాశాలు కోల్పోయింది మంగ్లీ. అవమానాలు కూడా ఎదుర్కొన్నానని చెప్పుకుని బాధపడిన సందర్భాలూ ఉన్నాయ్. తాను పాటను నమ్ముకునే వచ్చానని, పార్టీలను, పదవులను నమ్ముకొని రాలేదని చెప్పుకోవాల్సి వచ్చింది.

మంగ్లీపై పెరుగుతున్న నెగెటివిటీ

గతంలో బోనం పాటలో ఉపయోగించిన కొన్ని పదాలపై హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇలాంటి సందర్భాల్లో ఆమె క్షమాపణలు చెప్పినప్పటికీ, నెటిజన్లు ట్రోల్స్ కంటిన్యూ చేశారు. ఇటీవలే ఓ పాటను కొత్తగా ట్రై చేశారు మంగ్లీ. మంచి పాటలను ఎందుకు చెడగొడుతున్నావంటూ నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. తాను ఏ పని చేసినా విమర్శలు వస్తున్నాయని, ఒక కొత్త ప్రయత్నం చేసినప్పుడు ప్రోత్సహించకపోయినా పర్వాలేదు కానీ, ఇలా వ్యక్తిగతంగా దూషించడం బాధాకరమంటూ ఆమె బాధపడ్డారు. ఇటీవల బర్త్ డే పార్టీ చేసుకున్నా ఏవేవో ప్రచారాలు జరిగాయ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. మంగ్లీకి ఉన్న పాపులారిటీతో ఆమె గురించి నెగెటివిటీని స్ప్రెడ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. గిరిజన వర్గం నుంచి వచ్చి, తన సొంత ట్యాలెంట్ తో పాపులారిటీ సంపాదించుకుని, ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చింది మంగ్లీ. తప్పు చేస్తే చట్టం ఉంది. మరి తప్పు చేయని విషయాల్లో విమర్శలు, వివాదాల్లోకి లాగడం ఎంత వరకు కరెక్ట్?

మంగ్లీ vs శాంతి కథ

కష్టపడి ఈ స్థాయికి వచ్చాను.. మూలాలు మరచిపోలేదు… సింగర్ మంగ్లీ తరచూ చెప్పే మాట ఇది. పడి లేచిన కెరటానికి మంగ్లీ జీవితం ఓ ఉదాహరణ. ఇప్పుడు దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి విషయం చూద్దాం. ఈమెది కూడా గిరిజన నేపథ్యం. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు అందిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు.. తాడేపల్లి, ఉండవల్లి సహా 4 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. విశాఖ ఎండాడలో లగ్జరీ ఫ్లాట్‌, తాడేపల్లి కుంచనపల్లిలో G+2 భవనంతోపాటు 770 గ్రాముల బంగారు నగలు, 3 కిలోల వెండి గుర్తించారు. రూ.1.15 లక్షల క్యాష్, బ్యాంకు ఖాతాల్లో మరో 3 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. ఓ కారు, టూవీలర్. ఈమెకున్నవి ఇవే. అరెస్ట్ చేశారు. శాంతిని సస్పెండ్‌ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాలు కూడా జారీ చేశారు.

ఎదురుదెబ్బల మధ్య శాంతి జీవితం

వివిధ ఆరోపణలతో 2024 జులై నుంచి శాంతి సస్పెన్షన్‌లోనే ఉన్నారు. మార్చి 24న ఆమెపై ప్రభుత్వం సస్పెన్షన్‌ తొలగించింది. పోస్టింగ్‌ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతలోనే ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ రెయిడ్స్ జరగడం అరెస్ట్‌ అవడం, మళ్లీ సస్పెండ్ అవడం ఇవన్నీ ఆగమేఘాలపై జరిగిపోయాయి. ఈమె ముగ్గురు బిడ్డల తల్లి. జీవితంలో అన్ని ఎదురుదెబ్బలు తిన్నారు. అన్నీ తట్టుకుని నిలబడ్డారు. శాంతి చుట్టు కూడా రకరకాల వాగ్బాణాలు, సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు. అన్నిటినీ ఫేస్ చేశారు. ఒక దశలో మీడియా ముందు కంటతడి కూడా పెట్టుకున్నారు. విజయసాయిరెడ్డితో ఇష్యూలోనూ చాలా రకాల అవమానాలు ఎదుర్కొన్నారు. చెప్పాలంటే ఒక దశలో ఒంటరి అయ్యారు. జీవితం శూన్యంగా మారిపోయింది. విచ్చలవిడిగా ప్రచారాలు చేశారు. తాను గిరిజన మహిళను కాబట్టే తనను వేధిస్తున్నారని, ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఒక దశలో చెప్పుకుని బాధపడ్డారు.

పర్సనల్ లైఫ్ పబ్లిక్ చేశారా?

ఎండోమెంట్ అధికారి శాంతి వ్యక్తిగత జీవితం ఆమె ఇష్టం. 2013లో మదన్‌మోహన్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయనతో ఇద్దరు బిడ్డలు కలిగారు. అప్పట్లో ఆయన వేధింపులు భరించలేక గిరిజన సంప్రదాయం ప్రకారం 2016లో విడాకులు తీసుకున్నానని వివరించారు. ఆ తర్వాత 2020లో సుభాష్‌ అనే న్యాయవాదిని వివాహం చేసుకున్నారు. ఇదంతా ఆమె వ్యక్తిగత జీవితం. అయినప్పటికీ సోషల్ మీడియాలో పెట్టేశారు. విజయసాయిరెడ్డిని తాను విశాఖపట్నంలోనే చూశానని, ఆయనతో శాఖాపరమైన అంశాలు మాత్రమే చర్చించానని ఒక దశలో క్లారిటీ ఇచ్చుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా?

శాంతి కేసులో అసలు ప్రశ్న

శాంతి జీవితం అనుకున్నంత ఈజీగా ముందుకు సాగలేదు. పట్టుదలతో చదవడం వల్లే ఈ స్థాయికి వచ్చారు. శాంతి ఒక సాధారణ గిరిజన కుటుంబంలో జన్మించారు. చదువుకోవడమే ఒక పెద్ద సవాలుగా ఉన్న రోజుల్లో, ఆమె పట్టుదలతో ఉన్నత చదువులు చదివారు. ఉద్యోగంలోనూ చాలా కఠినమైన సవాళ్లే ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆరోపణలూ వచ్చాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. కానీ మిగితా విషయాల్లో ఆమె ఏం పాపం చేసిందని ట్రోల్ చేశారు? ఆమె ఒక ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ, ఆమెపై జరుగుతున్న క్యారెక్టర్ అస్సాసినేషన్ తీవ్ర మనో వేదనకు గురయ్యారు. ఇప్పుడు చట్టంపై నమ్మకంతో ఆమె తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. గిరిజన వర్గం నుంచి వచ్చి నిలదొక్కుకోవాలంటే ఇంతలా వ్యవస్థలపై పోరాటం చేయాలా?

మంగ్లీ ట్యాలెంట్ మర్చిపోయారా?

మంగ్లీ నేపథ్యం కూడా కష్టాల నుంచే మొదలైంది. గొంతు బాగుండి పాడడం కాదు.. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. సాధన చేశారు. కష్టపడ్డారు. ఆమె ప్రొఫెషనల్ సింగర్ అయ్యారు. అవకాశాల కోసం తిరిగిన తొలి రోజుల్లో ఆమెకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయ్. మంగ్లీ పాడే విధానంలో ఒక హై ఎనర్జీ ఉంటుంది. అది మట్టి వాసనను గుర్తు చేస్తుంది. తనకున్న ట్యాలెంట్ తో అవకాశాలు వచ్చాయ్. వాటిని అందిపుచ్చుకుంది. గిరిజన నేపథ్యం నుంచి రావడం, తనకంటూ ఒక సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం మంగ్లీ గుండె ధైర్యానికి నిదర్శనం.

అటు మంగ్లీ అయినా.. ఇటు ఎండోమెంట్ ఆఫీసర్ శాంతి అయినా.. ఇద్దరూ ఎదిగాకే వివాదాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఆ ఇద్దరిపై ఎందుకంత ద్వేషం అన్నదే ప్రశ్న. జీవితంలో ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో తెలుసు. తప్పు చేస్తే చట్టం ఉంది. న్యాయం ఉంది. ఈ వరుస వివాదాలు, సోషల్ మీడియాలో నెగెటివిటీతో మంగ్లీ ట్యాలెంట్ కు వాల్యూ లేకుండా పోయింది. శాంతి గ్రూప్ 1 ఆఫీసర్ గా ఎలా కష్టపడి ఎదిగారన్నది పట్టించుకోని పరిస్థితి. సో తప్పు చేసినా, చేయకపోయినా ఎందుకంత విద్వేషం అన్న ప్రశ్నలూ వస్తున్నాయ్. హేటర్సే కాదు.. సపోర్టర్స్ కూడా ఉంటారు.

Also Read: రంగు మారింది.. రణక్షేత్రం సిద్ధమైంది.. ఏప్రిల్ 25న కవిత కొత్త యుద్ధం!

Related News

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

Big Stories

Advertisement
×