Chiranjeevi: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా కౌశిక్ పెగలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కిష్కింధపురి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుంచి పాజిటివ్ టాక్ తోనే ముందుకు దూసుకెళ్తున్న ఈ హర్రర్ థ్రిల్లర్ రోజురోజుకి తన దూకుడును కొనసాగిస్తుంది. రోజులు పెరిగేకొద్దీ రికార్డ్ టికెట్స్ అమ్ముడుపోతూ మరింత విజయాన్ని అందుకుంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 66 ప్రీమియర్ షోస్ వెయ్యగా సాలిడ్ ఓపెనింగ్స్ తెచ్చుకొని.. రెండో రోజు తొలి రోజు కన్నా ఎక్కువ వసూళ్లు సాధించి ఇప్పుడు మూడోరోజ రికార్డు కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది. ఇక ఇంకోపక్క ఈ సినిమాపై సెలబ్రిటీలు సైతం తమ రివ్యూ ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు.
తాజాగా కిష్కింధపురి కి మెగా సర్టిఫికెట్ అందింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాపై తన అద్భుతమైన రివ్యూను అందించారు ” నమస్తే నా రాబోయే సినిమా మన శంకర వరప్రసాద్ గారు పండక్కొస్తున్నారు నిర్మిస్తున్న నిర్మాత సాహు గారపాటి గారు మరో చిత్రం కిష్కింధపురి అది రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఆ సినిమా చూసిన నాకు మంచి ప్రయత్నం చేశారని పెంచింది. అందుకుగాను ఆ చిత్రంలో నటించిన నటీనటులకు, టెక్నీషియన్స్ కు, నిర్మాతలకు నా అభినందనలు.
సాధారణంగా హార్రర్ సినిమాలు అంటే భయాన్ని ఎలివేట్ చేస్తూ ఒక దెయ్యం కథ చెప్పడం జరుగుతుంది. హార్రర్ తో పాటు ఒక మంచి సైకలాజికల్ పాయింట్ ను కూడా యాడ్ చేసి చెప్పడం చాలా బాగుంది. అంటే శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం చాలా ప్రమాదకరం అని చెప్పడం, అలాగే మనిషికున్న బాధలు, కష్టాలు పక్కన వాళ్లకు చెప్పుకోకుండా ఒంటరితనం అనుభవిస్తుంటే వచ్చే పరిణామాలు చాలా సమర్థవంతంగా చిత్రీకరించాడు డైరెక్టర్ కౌశిక్ పెగలపాటి.
ఇక ఈ చిత్రం ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఒక మంచి విజయాన్ని అందుకుంది. టోటల్ గా మన కిష్కింధపురి టీమ్ మొత్తానికి ఒక మంచి విజయాన్ని అందించిన ఏస్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి వెళ్లి థియేటర్లో సినిమా చూడండి అంటూ చెప్పుకొచ్చారు. మెగాస్టార్ రివ్యూతో ఈ సినిమాకు తిరుగులేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
#Kishkindhapuri is now certified by the BOSS ✅
Megastar @KChiruTweets Garu appreciated the team for coming up with a horror film laced with thilling elements ❤🔥❤🔥
Watch the THRILLING #Blockbusterkishkindhapuri at your nearest cinemas☠️
🎟️ Book your tickets for… pic.twitter.com/NvKtUUZqkz
— Shine Screens (@Shine_Screens) September 16, 2025