Minister Atchannaidu: నువ్వే మాజీ ముఖ్యమంత్రివి అంటూ వైఎస్ జగన్ పై వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ఎక్స్ వేదికగా లెక్కలతో కౌంటర్ ఇచ్చారు. క్వింటాల్ మిర్చి రూ.11,781 కొంటారని కొనలేదు కూటమి ప్రభుత్వం జగన్ విమర్శలు చేశారు. వైఎస్ జగన్ విమర్శలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. అయితే మద్దతు ధర కన్నా మార్కెట్ లో రూ.14,000 నుంచి రూ.15000 ధర పలుకుతుంటే రైతు దగ్గర తక్కువకు కొని ముంచేయమనా జగన్ ఉద్దేశమా? అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
వైసీపీ హయాంలో ఇ-క్రాప్, ఆర్బీకే, సచివాలయాలు రాజకీయ షోలు చేసేందుకు మాత్రమే వినియోగించారని, నేల మీద ఫలితం శూన్యమని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. గత ప్రభుత్వంలో రైతులు నష్టపోయినా ఒక్క రూపాయి పరిహారం లేదన్నారు. మిర్చి, మామిడి, పొగాకు కొనుగోళ్లు చేస్తామని చెప్పి చెల్లింపులు మాత్రం జీరో అన్నారు. రైతుల చెమటను చెల్లని వాగ్దానాలతో తుడిచిన పాలన జగన్‌దేనన్నారు.
‘చంద్రబాబు నాయకత్వంలో మాటలు కాదు, చర్యలు ఉంటాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వేగవంతంగా పంట నష్టం అంచనా వేస్తు్న్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీలు, బీమా పరిహారం, తక్షణ సహాయం అందిస్తాం. ప్రభుత్వం ప్రతి కష్టంలో రైతు వెంటే ఉంది. రైతు శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ధ్యేయం. పంటలకు మార్కెట్ జోక్యం కోసం రూ.300 కోట్లు (2025–26) బడ్జెట్‌లో కేటాయింపు చేశాం. ఇప్పటివరకు రూ.800 కోట్లు మద్దతు ధరల కోసం ఖర్చు చేశాం. 2020లో మిర్చీ ధర రూ.12,000 ఉన్నా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.7,000 మాత్రమే ప్రకటించింది. కానీ చెల్లింపులు ఒక్క రూపాయి కూడా చేయలేదు’ – మంత్రి అచ్చెన్నాయుడు
హెచ్.డీ బర్లీ పొగాకు కోసం రూ.271 కోట్లు, కోకో రైతులకు కిలోకు రూ.50 సాయం, తోతాపూరి మామిడి రైతులకు రూ.260 కోట్లు, ప్రతి కిలోకు రూ.4 అదనంగా చెల్లించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. టమాటా ధరలు తగ్గినప్పుడు రూ.3.25 కోట్లతో 2800 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. 14 నెలల్లో 4672 మెట్రిక్ టన్నులు టమాటా సేకరణ చేశామన్నారు.
Also Read: CM Chandrababu: అంబాసిడర్ కారుతో సీఎం చంద్రబాబుకు అనుబంధం.. పాత స్నేహితుడంటూ పోస్ట్
కర్నూలు ఉల్లి రైతుల కోసం రూ.1200 క్వింటా రేట్‌తో కొనుగోలు, హెక్టార్ కు 50,000 ఇచ్చిన ప్రభుత్వం తమదే అన్నారు. వీటన్నింటి మీద చర్చించేందుకు తాను సిద్ధం, వైఎస్ జగన్ కు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ చేశారు.