Solar Eclipse 2025: సెప్టెంబర్ 21వ తేదీన, పాక్షిక సూర్యగ్రహణం జరగబోతోంది. ఈ నెలలో పక్షం రోజుల తేడాతో మళ్లీ గ్రహణం ఏర్పడడం ఒక ప్రత్యేకం అనే చెప్పాలి. మహాలయ పక్షం అమావాస్య రోజున జరిగే ఈ గ్రహణం భారత్‌లో పూర్తిగా కనిపించదు. ఇది ప్రధానంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్కిటికా, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లోనే ప్రత్యక్షంగా దర్శనమవుతుంది. భారతదేశంలో ఈ పాక్షిక గ్రహణం రాత్రి 10.59 గంటలకు ప్రారంభమై, తెల్లవారుజామున 3.23 గంటల వరకు మాత్రమే కనిపిస్తుంది.
రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏమిటి?
సెప్టెంబర్ 21న జరగబోయే సూర్యగ్రహణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణంగా సూర్యగ్రహణం అంటే చంద్రుడు భూమి మధ్యలోకి వచ్చి సూర్యుడిని పూర్తిగా లేదా కొంతవరకు కప్పివేస్తాడు. కానీ ఈసారి గ్రహణం ప్రత్యేకత ఏమిటంటే, ఇది “అన్నులర్ సోలార్ ఎక్లిప్స్”. అంటే చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పకుండా, చుట్టూ అగ్నివలయంలా మెరిసిపోతాడు. ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని సాధారణంగా “రింగ్ ఆఫ్ ఫైర్” అని పిలుస్తారు. ఈ గ్రహణం ఆసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, పసిఫిక్ ప్రాంతాల్లోని కొంతమంది ప్రజలకు ప్రత్యక్షంగా చూడగలిగే అవకాశం ఉంది.
ఎప్పుడు కనిపిస్తుంది?
భారతదేశంలో ఈ గ్రహణం పూర్తిగా కాకుండా కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది. అంటే సూర్యుడి ఒక భాగం మాత్రమే చంద్రుడు కప్పి వేస్తుంది, అందువల్ల మనం మొత్తం సూర్యుడిని చూడలేము. భారతదేశంలో ఈ పాక్షిక గ్రహణం రాత్రి 10.59 గంటలకు ప్రారంభమై, తెల్లవారుజామున 3.23 గంటల వరకు మాత్రమే కనిపిస్తుంది.
Also Read: Flipkart Offers 2025: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025.. షాపింగ్ పండుగకు సిద్ధమా?
గ్రహణం సమయంలో చేయకూడని పనులు
గ్రహణాల గురించి పూర్వకాల నుండి ఎన్నో విశ్వాసాలు, ఆచారాలు ఉన్నాయి. గ్రహణం సమయంలో భోజనం చేయకూడదు, గర్భిణీలు బయటకు వెళ్లకూడదు, నీటిలో స్నానం చేయాలి, దానం చేయాలి వంటి సంప్రదాయాలు ఇంకా కొనసాగుతున్నాయి. శాస్త్రీయంగా చూస్తే, గ్రహణం సమయంలో సూర్యకిరణాలు మారతాయి, గాలి, వాతావరణంలో చిన్న మార్పులు వస్తాయి.
ఎలా చూడాలి?
ఈసారి ప్రత్యేకత ఏమిటంటే, చంద్రుడు భూమికి కాస్త దూరంగా ఉన్నందున సూర్యుడిని పూర్తిగా కప్పలేకపోయాడు. అందువల్ల సూర్యుడి అంచులు వెలిగిపోతూ అద్భుతమైన అగ్నివలయం లా మెరిసిపోతాయి. ఈ దృశ్యం చాలా అరుదుగా మాత్రమే మనకు చూడడానికి వస్తుంది. గ్రహణం చూడాలనుకునే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేక ఫిల్టర్ లేదా సన్‌గ్లాసెస్ లేకుండా సూర్యుడిని నేరుగా చూడకూడదు, లేకపోతే కళ్ళకు హాని కలగవచ్చు. ఖగోళ శాస్త్రవేత్తలు ప్రత్యేక సన్‌గ్లాసెస్ వాడమని సూచిస్తున్నారు.
సూర్యగ్రహణం ఒక సహజ, శాస్త్రీయ ప్రక్రియ అయినప్పటికీ, ప్రజల్లో దీని పట్ల భక్తి, ఆశ్చర్యం, కొంచెం భయం కూడా ఉంటుంది. సెప్టెంబర్ 21న జరగబోయే గ్రహణం ఖగోళ శాస్త్రవేత్తలు, పరిశోధకులకు, సాధారణ ప్రజలకు ఒక మరిచిపోలేని అనుభవం. ఆకాశంలో మెరిసే అగ్నివలయాన్ని కళ్లారా చూడటం జీవితంలో ఒక్కసారే లభించే అరుదైన అనుభవం.
గ్రహణం- రాశులపై ప్రభావం
సెప్టెంబర్ 21న జరిగే సూర్యగ్రహణం మరో విశేషం ఉంది. ఇది సింహరాశిలో జరుగుతోంది. అందువల్ల సింహరాశి వారు గ్రహణం సమయంలో సూర్యుడిని చూడకూడదు. అలాగే ఈ గ్రహణం సముద్ర ప్రాంతాల్లో చోటుచేసుకుంటోంది. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం, సముద్రంలో అలలు సాధారణానికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, తీర ప్రాంతాల్లో నివాసమున్న ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచిస్తున్నారు.
* రాశుల విషయానికి వస్తే, ఈ సూర్యగ్రహణం సింహరాశి వారికి అదృష్టాన్ని తీసుకురావచ్చని భావిస్తున్నారు. వారి సంపద పెరుగుతూ, ఊహించని స్థాయిలో డబ్బు రావడం, ఆర్థిక స్థితి బలపడటం, ఏ పని చేసినా విజయవంతం కావడం ఇలా అనేక సానుకూల ఫలితాలు ఉంటాయి.
* కుంభరాశి వారు కూడా ఈ గ్రహణంతో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పేరు, ప్రతిష్ట, గుర్తింపు వస్తుంది. ఆకస్మిక ధన లాభం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి.
* ఇక తులరాశి వారు కూడా సూర్యగ్రహణం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. సంపాదన, ఆరోగ్యం పరంగా, సమాజంలో గౌరవం, మర్యాదలు లభించడం వంటి అనేక లాభాలు కలుగుతాయి. ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే మూడు గ్రహణాలు జరిగాయి. ఈ గ్రహణాలు, ప్రతి ఒక్కరికీ కొన్ని కొత్త అవకాశాలను, జాగ్రత్తలు, అదృష్టాన్ని తీసుకురానున్నాయి.