Tollywood :సాధారణంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది అవకాశాల కోసం లొంగిపోతే.. మరికొంతమంది వాటిని ఎదురొడ్డి ఇండస్ట్రీలో ఒక స్టేజిలో నిలబడ్డారు. ఇంకొంతమంది వీటికి భయపడి ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయిన వారు కూడా లేకపోలేదు. మరి కొంతమందేమో ఇండస్ట్రీలో దశాబ్దాలుగా కొనసాగుతూ ఈ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడకుండా తమను తాము సంరక్షించుకుంటూ అడపాదడపా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్లు ఎప్పటికప్పుడు సంచలన కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ (Ramya Krishnan) ను మొదలుకొని ఇప్పుడు ప్రముఖ బ్యూటీ అమీషా పటేల్ (Ameesha Patel) వరకు చాలా మంది హీరోయిన్స్.. అవకాశాలు కావాలి అంటే ఇండస్ట్రీలో పక్క ఎక్కాల్సిందే అంటూ సంచలన కామెంట్లు చేయడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది.
అసలు విషయంలోకి వెళితే .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటించిన ‘బద్రి’ సినిమాతో తనకంటూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది అమీషా పటేల్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. ఇండస్ట్రీలో అవకాశాలపై ఊహించని కామెంట్లు చేసింది. అమీషా పటేల్ మాట్లాడుతూ.. బాలీవుడ్ ఇన్సైడర్స్ నన్ను ఇష్టపడడం లేదు. కారణం పాత్రల కోసం పడుకునే క్యారెక్టర్ నాది కాదు. మందు తాగను, పార్టీలకు హాజరుకాను.. అందుకే అవుట్ సైడర్ గా నన్ను ట్రీట్ చేస్తున్నారు. ఈ కారణంగానే ఎన్నో అవకాశాలు కూడా కోల్పోయాను. సాధారణ హీరోయిన్ల మాదిరిగా రాజీ పడకుండా ఇందుకు విరుద్ధంగా ఉండడంతోనే ఇండస్ట్రీ నుంచి నన్ను వెలివేశారు. అందుకే ఇప్పటికీ కూడా అవకాశాలు ఇవ్వడం లేదు. అవకాశాలు రావాలి అంటే కచ్చితంగా పక్క ఎక్కాల్సిందే” అంటూ హాట్ బాంబ్ పేల్చింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఎంతోమంది హీరోయిన్స్ ఇప్పటికీ కూడా అవకాశాల కోసం ఇబ్బందులు పడుతూ ఉండడం అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.
అమీషా పటేల్ కెరియర్..
2000 సంవత్సరంలో ‘కహోనా ప్యార్ హై’ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో బద్రి, నాని వంటి చిత్రాలలో నటించి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ‘నరసింహుడు’ చిత్రంలో కూడా తెలుగు ప్రేక్షకులను అలరించింది. తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలా 2023లో ‘గద్దర్ 2’ సినిమాలో నటించిన ఈమె ‘తౌబా తేరా జల్వా’ సినిమాలో కూడా నటించింది. బిగ్ బాస్ 13 లో పార్టిసిపేట్ చేసింది.
ALSO READ:Tollywood: తల్లి కాబోతున్న వెంకటేష్ హీరోయిన్.. ఈ ఏడాదే మొదటి బిడ్డకు ఆహ్వానం!
హీరోయిన్ గానే కాదు నిర్మాతగా కూడా..
ఇకపోతే మొదట మోడల్ గా కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత నటిగా తన కెరియర్ ను కొనసాగించింది. మధ్యలో నిర్మాతగా కూడా పలు చిత్రాలు నిర్మించింది ఈ ముద్దగుమ్మ. ముంబై మహారాష్ట్రకు చెందిన అమీషా పటేల్ చాలా సెలెక్టెడ్ గా పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పుడు వరుసగా అవకాశాలు రాకపోవడం పై కూడా స్పందించి అందరిని ఆశ్చర్యపరిచింది.