Chiranjeevi Hanuman : ఈ మధ్య ఆర్టిఫిషల్ ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. రంగాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంతే కాదు ఈమధ్య కొన్ని ముఖ్యమైన పనులకు ఏఐ ను వాడుతున్నారు. దాంతో ఉద్యోగులపై వేటు పడింది. ఇప్పటికే వేల కంపెనీలు ఏఐ వైపు మొగ్గు చూపిస్తున్నారు. కేవలం వాణిజ్య రంగాల్లో మాత్రమే కాదు ఇటు ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా ఏఐ ను ఎక్కువగా వినియోగించేందుకు సినీ ప్రముఖులు ఆసక్తి కనబరుస్తున్నారు..
ఈ మధ్య కాలంలో ఏఐ తో అనేకమంది ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా తమ సృజనాత్మక ఆలోచనలకి జీవం పోస్తున్నారు.. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిం లలో ఏఐ ను వాడుతున్నారు. తాజాగా మరో పూర్తి మూవీని బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు. ఆ మూవీ పేరే చిరంజీవి హనుమాన్.. తాజాగా ఈ మూవీ గురించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు..
‘చిరంజీవి హనుమాన్ ‘ రిలీజ్ డేట్ లాక్..?
బాలీవుడ్ నుంచి ఒక పూర్తి ఏ ఐ సినిమా అది కూడా హనుమంతునిపై తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి ప్రముఖ సినీ నిర్మాతలు విక్రమ్ మల్హోత్రా, విజయ్ సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే థియేటర్లలోకి రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది థియేటర్స్ లో హనుమాన్ జయంతి సందర్బంగా థియేటర్లలోకి రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పటివరకు ఏ సినిమాకు ఇలాంటి టెక్నాలజీని వాడలేదు. మొదటిసారి ఈ టెక్నాలజీతో రాబోతున్న సినిమాపై సర్వత్రా అంచనాలు పెరుగుతున్నాయి. మరి మూవీ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..
Also Read : గ్యాంగ్‌స్టార్స్‌గా రజనీ, కమల్… లోకీ మావా మెంటల్ మాస్ ప్లాన్ ఇది..
ప్రేక్షకులను మెప్పించిన విజువల్స్..
హిందూ పురాణాల్లో అత్యంత శక్తివంతమైన దేవుడిగా, భక్తుడిగా పేరుగాంచిన హనుమంతుని శౌర్యం, భక్తి, అద్భుత గాథను ఏఐ ఆధారిత యానిమేషన్ విజువల్ మూవీ గా దీన్ని తెరకెక్కించారు. విజువల్స్, గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలను.. అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లతో కలసి, ఏఐ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి, హనుమంతుని వ్యక్తిత్వాన్ని కొత్త కోణంలో చూపించబోతున్నారని టీమ్ ఎప్పుడో వెల్లడించింది. మొన్న ఈ మధ్య వచ్చిన మహావతార్ నరసింహ యానిమేషన్ మూవీ గా వచ్చింది. మొదటి షో నుంచే ప్రేక్షకులను మెప్పించింది. మరి ఈ మూవీకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. బాలీవుడ్ నుంచి రాబోతున్న ఈ మూవీ సక్సెస్ అయితే ఏఐ వినియోగం సినీ ఇండస్ట్రీలో పెరిగే అవకాశాలు ఉన్నాయి.
LORD HANUMAN'S DIVINE STORY ON THE BIG SCREEN ANNOUNCED – AI-DRIVEN FILM 'CHIRANJEEVI HANUMAN' TO RELEASE ON HANUMAN JAYANTI 2026… #AbundantiaEntertainment and #CollectiveMediaNetwork's #Historyverse join forces for a first-of-its-kind 'Made-In-AI', 'Made-In-India' feature film… pic.twitter.com/voXYWJMdBs
— taran adarsh (@taran_adarsh) August 19, 2025