BigTV English

Tollywood: సౌందర్య శ్వేతనాగు మూవీ రచయిత కన్నుమూత.. ఆ సమస్యలే కారణమా?

Tollywood: సౌందర్య శ్వేతనాగు మూవీ రచయిత కన్నుమూత.. ఆ సమస్యలే కారణమా?

Tollywood:సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా చాలామంది సెలబ్రిటీలు వృద్ధాప్య కారణాలతో తుదిశ్వాస విడుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రముఖ రచయితగా పేరు సొంతం చేసుకున్న లల్లాదేవి అలియాస్ పరుచూరి నారాయణాచార్యులు (Paruchuri narayanacharyulu) అక్టోబర్ 3వ తేదీ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 82 సంవత్సరాలు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఈయన మరణ వార్త విని అటు సినీ సెలబ్రిటీలు, ఇటు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. అలాగే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు.


200కి పైగా నవలలు, నాటకాలు..

లల్లా దేవిగా పేరు సొంతం చేసుకున్న ఈయన లల్లా దేవి పేరిట సుమారుగా 200కి పైగా నవలలు, నాటకాలు రచించారు. వాటిలో మహామంత్రి తిమ్మరసు, ఆమ్రపాలి వంటి నవలలు మంచి ప్రాచుర్యం పొందాయి. తెలుగు చిత్రాలకి కూడా రచయితగా పనిచేశారు.

లల్లాదేవి నవలల ఆధారంగా రూపొందిన చిత్రాలు..


ఇకపోతే లల్లా దేవి రాసిన ప్రముఖ నవల ‘శ్వేత నాగు’ ఆధారంగానే సి.వి.రెడ్డి, సంజీవ దర్శకత్వంలో అదే టైటిల్ తో సినిమా నిర్మించారు. ఇది సౌందర్య 100వ సినిమా కావడం గమనార్హం. లల్లాదేవి శ్వేతనాగు నవల సినిమాగా రూపుదిద్దుకున్నప్పుడు తోటపల్లి సాయినాథ్ ఈ చిత్రానికి సంభాషణలు అందించారు. దివంగత నటీమణి సౌందర్య (Soundarya) ప్రధాన పాత్రలో అబ్బాస్ (Abbas) కీలక పాత్ర పోషించారు. అంతేకాదు సీనియర్ హీరో , స్వర్గీయ నందమూరి తారక రామారావు (Sr NTR) నటించిన ‘సామ్రాట్ అశోక’ చిత్రం కూడా ఈయన నవల ఆధారంగానే రూపొందించడం జరిగింది. బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘కరుణించని కనకదుర్గ’. ఈ చిత్రానికి లల్లాదేవి కథను అందించారు. ఈ సినిమాలో కె.ఆర్ విజయ టైటిల్ రోల్ పోషించగా.. శ్రీనివాస శర్మ, యమున జంటగా ఆకట్టుకున్నారు. 1992లో వచ్చిన ఈ సినిమాకి ప్రముఖ రచయిత సత్యానంద సంభాషణలు అందించారు.

అందులో ఏకైక రచయితగా గుర్తింపు..

1980వ దశకంలో తెలుగు సాహితీ రంగంలో సుప్రసిద్ధులైన రచయితలలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. రాసిన పలు నవలలు మొదట సీరియల్స్ రూపంలో వచ్చాయి. జానపద , సాంఘిక, చారిత్రక రచనలు చేయడంతో మంచి పేరు దక్కించుకున్నారు. అంతేకాదు పాములపై పరిశోధన చేసిన ఏకైక రచయితగా కూడా పేరు దక్కించుకున్నారు.

ఎన్టీఆర్ దగ్గర కార్యదర్శిగా..

ఇకపోతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకి పరుచూరి నారాయణాచార్యులు అత్యంత సన్నిహితులు. కొంతకాలం సీనియర్ ఎన్టీఆర్ దగ్గర కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఈయన స్వస్థలం గుంటూరు జిల్లా పత్తిపాడు సమీపంలోని నిమ్మగడ్డ వారిపాలెం.

 

ALSO READ:Janhvi kapoor: అవుట్ సైడర్ సెలబ్రిటీస్ కి జాన్వీ చురకలు.. దెబ్బ గట్టిగానే తగిలిందే?

Related News

Kantara chapter 1: 2 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి.. జోరు మామూలుగా లేదుగా?

Janhvi kapoor: అవుట్ సైడర్ సెలబ్రిటీస్ కి జాన్వీ చురకలు.. దెబ్బ గట్టిగానే తగిలిందే?

Star Singer: స్టార్ సింగర్ కు నాలుగేళ్ల జైలు శిక్ష.. డ్రగ్స్ మత్తులో అమ్మాయిలతో అలా!

Vijay – Rashmika: సీక్రెట్ గా విజయ్, రష్మిక ఎంగేజ్మెంట్

NBK 111: మరోసారి ద్విపాత్రాభినయంలో బాలయ్య..బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!

MSVPG: చిరంజీవితో ఢీ కొట్టబోతున్న నాని విలన్.. అనిల్ స్కెచ్ మామూలుగా లేదే?

Sreeleela: ఆ సినిమా నుంచి జాన్వీ కపూర్ అవుట్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీ లీల!

Big Stories

×