Hrithik Roshan: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan)ఇటీవల వార్ 2(War 2) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆయాన్ ముఖర్జీ (Ayan Mukerji)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యశ్ రాజు ఫిలిం యూనివర్స్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా విడుదలకు ముందు సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి కానీ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి.
ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) కూడా నటించిన విషయం తెలిసిందే.. ఇలా ఈ సినిమాలో ఎన్టీఆర్ భాగం కావడంతో సినిమాపై సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 14 వ తారీకు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో కాస్త విఫలమైంది. ఇకపోతే థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేశారు. ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీ నుంచి డిజిటల్ మీడియాలో ప్రసారం కానుంది. ఇలాంటి తరుణంలోనే హృతిక్ రోషన్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. వార్ 2 ప్రాజెక్టు గురించి నాకు ముందుగానే తెలుసు కాబట్టి తాను కబీర్ పాత్రను చాలా ఎంజాయ్ చేస్తూ పూర్తి చేశానని వెల్లడించారు. ఇది కష్టమైన చాలా ఇష్టంగా పూర్తి చేశానని వెల్లడించారు. తాను ప్రతి ఒక్క నటీనటులకు ఒకటే విషయం తెలియజేస్తాను. ఒక నటుడిగా మీరు ఆ పాత్రకు ఎంత చేయాలో అంతా చేయండి మీ పని మీరు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిపోండి. ఈ సినిమా విషయంలో కూడా నేను అదే చేశాను ఇక సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ నన్ను చాలా బాగా చూసుకున్నారని తెలిపారు.
మనం చేసే ప్రతి ఒక్క సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ చేస్తాము. ఈ సినిమా విషయంలో కూడా తాను రెండు విషయాల గురించి ఆలోచించాను. దేనినైనా నువ్వు చేయగలవు. అయితే ప్రతి సినిమాకి గాయాలు పాలవుతూ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు కొన్ని చాలా ప్రశాంతంగా కూడా చేయవచ్చు. ఇలా మన పనిని మనం చేసుకుంటూ పోతే విజయం దానంతట అదే వస్తుంది అంటూ హృతిక్ రోషన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా విడుదలైన సమయంలో సినిమాపై ఎన్నో నెగటివ్ కామెంట్లు కూడా వ్యక్తమైన నేపథ్యంలో హృతిక్ ఈ విధంగా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అయితే ఈ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ కానీ తరుణంలో ఎన్టీఆర్ అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేశారు.
Also Read: Srinidhi Shetty: అందరూ నన్ను లేడీ ప్రభాస్ అంటారు.. డార్లింగ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే?