Lokesh Kanagaraj : తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈయన తెరకెక్కించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనాలు సృష్టించాయి. రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ సినిమాను తెరకెక్కించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్ము దులిపేస్తుంది.. ఆగస్టు 14న థియేటర్ లోకి వచ్చిన ఈ మూవీ ఇప్పటివరకు 400 కోట్లకు పైగా వసూలు చేసిందని మేకర్స్ ప్రకటించారు.. ఈ మూవీ తర్వాత లోకి ఏ హీరోతో సినిమా చేస్తాడా అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలకు చెక్ పడింది.. ఒకరు కాదు, ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..
గ్యాంగ్‌స్టార్స్‌గా రజినీ, కమల్..
స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నటుడు కార్తీతో ఖైదీ 2 సినిమాను లైన్‌లో పెట్టిన లోకేష్.. దీనికన్నా ముందు మరో క్రేజీ మూవీని తెరకెక్కించాబోతున్నాడని టాక్.. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌లతో కలిసి కలిసి లోకేష్ ఒక భారీ మల్టీస్టారర్ చేయబోతున్నట్లు కోలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కోవిడ్ సమయంలో ఈ మూవీని తెరకెక్కించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నట్లు సమాచారం..
ఈ మూవీ స్టోరీ ఇదే..?
రజినీ కాంత్, కమల్ హాసన్ ఇద్దరు కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు. వీరిద్దరి సినిమాలు వస్తున్నాయంటే హంగామా మాములుగా ఉండదు. అలాంటిది ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే విజిల్స్ పడటం ఖాయం. మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఇద్దరు వయసు మళ్లిన గ్యాంగ్‌స్టర్ల కథ అని తెలుస్తుంది. హీరోల ఇమేజ్‌కు తగ్గట్టుగా లోకేష్ కనగరాజ్ ఈ కథను సిద్ధం చేశాడని.. ఈ కథకు ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించబోతుందని సమాచారం.. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.
Superstar #Rajinikanth & #KamalHaasan to act Together Under #LokeshKanagaraj's Direction & in RKFI Production..😲💥 Project is said to be in Talks..🤝 This Project was supposed to happen even before Covid..✌️ The Film is about "TWO AGING GANGSTERS.."🔥 pic.twitter.com/bQW8mBPJh8
— Laxmi Kanth (@iammoviebuff007) August 19, 2025
Also Read : ‘ధూమ్ 4 ‘ టాలీవుడ్ స్టార్ హీరో?..బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..!
‘ఖైదీ 2’ అప్డేట్..
రీసెంట్ గా లోకేష్ కనకరాజు కూలీతో మంచి టాక్ ను సొంతం చేసుకున్నారు. దీని తర్వాత కార్తీ హిట్ మూవీ ఖైదీకి సీక్వెల్ గా రాబోతున్న ఖైదీ 2 ను చెయ్యాల్సి ఉంది. కానీ ఖైదీ 2 స్క్రిప్ట్ ని పూర్తి చేయాలి. అది షూట్ చేశాక అమీర్ ఖాన్ తో సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో బాలీవుడ్ మూవీ ఉంది. లైన్ లో రోలెక్స్ ని పెట్టుకున్నాడు. ఇవన్నీ కాదని రజని కమల్ తో ముందుకు వెళ్తాడని టాక్.. ఈ మూవీ ని ఎప్పుడు ఎప్డు స్క్రీన్ మీద చూద్దామని, ఈ మూవీ ని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామా అని అభిమానులు ఇప్పటినుంచే వెయిట్ చేస్తున్నారు.