ChatGpt Go Subscription| చాట్ జిపిటి మాతృసంస్థ ఓపెన్‌ఏఐ భారత్‌లో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ లాంచ్ చేసింది. ‘చాట్‌జీపీటీ గో’ పేరుతో విడుదలైన ఈ ప్లాన్ నెలకు కేవలం 399 రూపాయల ధరలో అందుబాటులో ఉంది. ఇదే కాకుండా.. ఓపెన్‌ఏఐ తమ అన్ని చాట్‌జీపీటీ సబ్‌స్క్రిప్షన్‌ల కోసం యూపీఐ చెల్లింపులను కూడా ప్రవేశపెట్టింది. ఈ పేమెంట్ విధానంతో భారతీయులకు అడ్వాన్స్ ఏఐ టూల్స్.. మరింత సులభంగా.. సరసమైన ధరలో అందించే లక్ష్యంతో రూపొందించబడింది. చాట్‌జీపీటీ గో అనేది భారత్‌లో ఓపెన్‌ఏఐ సేవలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో.. యూజర్లకు అధిక సౌలభ్యం కల్పించే కొత్త ప్లాన్.
ఈ కొత్త ప్లాన్ వినియోగదారులకు అనేక ప్రముఖ ఫీచర్‌లను అందిస్తుంది. ఉచిత ప్లాన్‌తో పోలిస్తే.. చాట్‌జీపీటీ గో 10 రెట్లు ఎక్కువ మెసేజ్ లిమిట్‌ని అందిస్తుంది. దీంతోపాటు.. ఇది జీపీటీ-5 ఆధారంగా చిత్రాలను రూపొందించే సామర్థ్యం, ఫైల్ అప్‌లోడ్ సౌకర్యం, మెమరీ ఫీచర్‌లను కలిగి ఉంది. ఇందులో భారతీయ భాషలకు మెరుగైన సపోర్ట్ కూడా ఉంది. దీనివల్ల భారతీయ యూజర్లకు మరింత సౌలభ్యం లభిస్తుంది.
ఈ కొత్త ప్లాన్‌తో పాటు.. ఓపెన్‌ఏఐ ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రిప్షన్ మిగతా ఆప్షన్స్ ని కూడా కొనసాగిస్తోంది. చాట్‌జీపీటీ ప్లస్, నెలకు 1,999 రూపాయల ధరతో, వేగవంతమైన పర్‌ఫామెన్స్, ప్రయారిటీ యాక్సెస్, ఎక్కువ వినియోగ పరిమితులను అందిస్తుంది. అలాగే.. ప్రొఫెషనల్స్, ఎంటర్‌ప్రైజ్‌ల (బిజినెస్) కోసం చాట్‌జీపీటీ ప్రో ప్లాన్ నెలకు 19,900 రూపాయల ధరతో అందుబాటులో ఉంది. ఇది కస్టమైజేషన్ తో భారీ స్థాయిసేవలు అందించే ప్లాన్.
ప్రపంచవ్యాప్తంగ చాట్ జిపీటీ వినియోగదారులు ఎక్కువగా రెండో అతిపెద్ద దేశం ఇండియా. పైగా భారత మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ విద్యార్థులు, ప్రొఫెషనల్స్, డెవలపర్లు, క్రియేటివ్ వర్క్స్, కంటెంట్ క్రియేటర్లు ఈ సాధనాన్ని రోజువారీ విద్య, పని, సృజనాత్మకత, సమస్యల పరిష్కారం కోసం వినియోగిస్తున్నారు.
ఓపెన్‌ఏఐ వైస్ ప్రెసిడెంట్, చాట్‌జీపీటీ హెడ్.. నిక్ టర్లీ ప్రకారం.. భారతీయులు చాట్ జిపిటీని ఎంతో ఉత్సాహంగా ఉపయోగిస్తున్నారని, దీన్ని మరింత సులభంగా, యూపీఐ చెల్లింపుల ద్వారా అందుబాటులోకి తీసుకురావడం తమ లక్ష్యమని తెలిపారు.
ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ కూడా భారత యూజర్లపై ప్రశంసలు కురిపించారు. ఆయన ఈ నెలలో భారత్ తమ అతిపెద్ద మార్కెట్‌గా మారే అవకాశం ఉందని, ఇక్కడి పౌరులు, వ్యాపారాలు ఏఐని అసాధారణ వేగంతో అవలంబిస్తున్నాయని పేర్కొన్నారు.
చాట్‌జీపీటీ గో ప్లాన్ ద్వారా, ఓపెన్‌ఏఐ భారతీయ వినియోగదారులకు అడ్వాన్స్ ఏఐ టెక్నాలిజీని సరసమైన ధరలో అందించేందుకు కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఈ కొత్త ప్లాన్ భారత్‌లో ఏఐ వినియోగాన్ని మరింత విస్తరించే అవకాశం ఉంది, విద్య, సృజనాత్మకత, వృత్తిపరమైన అవసరాలను మరింత సమర్థవంతంగా తీర్చగలదు.
Also Read: 2025లో బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్లు ఇవే.. వివో X200 ప్రోకు సవాల్!