Chiranjeevi: సాధారణంగా 70 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు. అన్ని పనులు ఆపేసి.. ఇంట్లో కొడుకు, కోడలు టైమ్ కు ఫుడ్ పెడుతుంటే తింటూ హాయిగా కృష్ణ రామ అంటూ కాలం వెళ్లదీస్తారు. కానీ, మెగాస్టార్ చిరంజీవి అలా కాదు. వరుస సినిమాలతో కుర్ర హీరోలకు సైతం దడలు పుట్టిస్తున్నారు. అంతేనా అసలు ఈయన ఎక్కడైనా అమృతం ఏమైనా తాగారా.. వయస్సు తరుగుతుంది కానీ, పెరగడం లేదు అని సందేహపడేలా చేస్తున్నారు. లేకపోతే ఆ ఫోటోషూట్స్ ఏంటి.. ముఖంలో ఆ తరగని అందం ఏంటి.. ? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అసలేం జరిగింది అంటే.. మెగాస్టార్ చిరంజీవి ప్రతిసారి కొత్త కొత్త ఫోటోషూట్స్ తో అభిమానులను అలరిస్తూ ఉంటారు. తాజాగా చిరు ఫోటోషూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రవి స్టూడియోస్ అనే సంస్థ ఆయన ఇంట్లో నిర్వహించిన ఈ ఫోటోషూట్ లో చిరు యంగ్ లుక్ లో కనిపించి షేక్ చేశాడు. ఒకపక్క క్లాస్ గా సూట్ లో కనిపించగా.. ఇంకోపక్క ఫ్లోరల్ షర్ట్ తో మాస్ లుక్ లో కనిపించాడు. అలా ఒక అయిదారు డ్రెస్ లలో కనిపించి షాక్ ఇచ్చాడు.
ప్రస్తుతం చిరు ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వయస్సులో ఈ ఫోటోషూట్స్ ఏంటి అని కొందరు అంటుండగా.. మెగా ఫ్యాన్స్ మాత్రం చిరు ఛార్మ్ కి, స్వాగ్ కి ఫిదా అవుతున్నారు. బాస్ లుక్స్ సూపర్ అని కొందరు.. బాసూ.. నీకు 70 ఏళ్లు.. దానికి తగ్గట్లు ఉంటారా.. కుర్రాళ్ళనే డామినేట్ చేసేలా ఉన్నారని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ప్రజెంట్ చిరు సినిమాల విషయానికొస్తే.. ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. విశ్వంభర సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈ సినిమా తరువాత చిరు నటిస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. వీటితో పాటు బాబీ కొల్లి దర్శకత్వంలో చిరు మెగా 158 సినిమా చేస్తున్నాడు. వాల్తేరు వీరయ్య తరువాత వీరి కాంబోలో వస్తున్న చిత్రమిది. ఇక ఈ మూడు కాకుండా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. మరి ఈ సినిమాలతో చిరు ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.