BigTV English

Viral News: రాత్రయితే నాగినిగా మారి కాటేస్తున్న భార్య.. కలెక్టర్ కు భర్త ఫిర్యాదు!

Viral News: రాత్రయితే నాగినిగా మారి కాటేస్తున్న భార్య.. కలెక్టర్ కు భర్త ఫిర్యాదు!

UP Viral News:

మన దగ్గర గ్రీవెన్స్ డే మాదిరిగా, ఇతర రాష్ట్రాల్లోనూ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు తీసుకుంటారు. కొంత మంది ప్రతి వారం తీసుకుంటే, మరికొంత మంది వీలును బట్టి 10 రోజులకు ఓసారి తీసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఓ కలెక్టర్ కు ఓ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ చూసి షాకయ్యాడు. రాత్రయితే, అతడి భార్య పాముగా మారి భయపెడుతుందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరాడు. ప్రస్తుతం ఈ కంప్లైంట్ యూపీలో హాట్ టాపిక్ గా మారింది.


రాత్రయితే పాముగా మారి కాటేస్తున్నభార్య!

రీసెంట్ గా సీతాపూర్ జిల్లా మెజిస్ట్రేట్  ‘సమాధాన్ దివాస్’(గ్రీవెన్స్ డే) నిర్వహించారు. ఈ సందర్భంగా మహ్ముదాబాద్ తహసీల్‌ పరిధిలోని లోధాసా గ్రామానికి చెందిన మెరాజ్ కలెక్టర్ ను కలిసి తన బాధను చెప్పుకున్నాడు. తన భార్య నాసిమున్ మానసిక పరిస్థితి బాగాలేదని, రాత్రయితే నాగిన్ (ఆడ పాము) లాగా  మారి బుసలు కొడుతూ, భయపెడుతుందన్నాడు. చాలా రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు బాధపడ్డాడు. స్థానిక పోలీసులను పదే పదే సహాయం కోరినప్పటికీ, వారు ఎటువంటి చర్య తీసుకోలేదన్నాడు. ఏం చేయాలో తెలియక సమాధాన్ దివాస్ కు వచ్చినట్లు చెప్పాడు.

ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన కలెక్టర్  

మొరాజ్ ఫిర్యాదును చూసి జిల్లా కలెక్టర్ ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పడంతో వాళ్లు కూడా షాకయ్యారు. వెంటనే, ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని పోలీసులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. “మాకు ఫిర్యాదు అందింది.  ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటాం” అని పోలీసు అధికారి తెలిపారు.


Read Also: ఫోన్ చూస్తూ డ్రైవింగ్.. రెప్పపాటులో ఘోరం, ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

భార్య ముక్కు కోసిన భర్త

అటు మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌ లో ఒక వ్యక్తి తన భార్య ముక్కును కోసిన ఘటన సంచలనం కలిగించింది. భర్త నుంచి విడిపోయిన 35 ఏళ్ల మహిళ తాన్సేన్ నగర్‌ లోని స్థానిక డెయిరీలో ఉద్యోగం చేస్తుంది. తాజాగా డ్యూటీకి వెళ్తుండగా హోటల్ ఫ్లిన్ సమీపంలో ఈ దాడి జరిగింది. చార్ షహర్ నాకాలో అద్దె ఇంట్లో నివసిస్తున్న రాంతాపురకు చెందిన ఆ మహిళ పనికి కాలినడకన వెళుతుండగా, భర్త ఆమెను వెంబడించాడు. ఫ్లిన్ హోటల్ సమీపంలో ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, తను అంగీకరించలేదు. తనతో మాట్లాడకూడదంటూ వార్నింగ్ ఇచ్చింది. కోపంతో ఊగిపోయిన భర్త తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె ముక్కను కోశాడు. మాట్లాడకపోతే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. సదరు మహిళ భర్తకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు.

Read Also: బెడ్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎలుగుబంటి.. వెంటనే ఆ మహిళ ఏం చేసిందంటే?

Related News

Viral Video: ఓయమ్మా.. మోడీఫై స్కూటర్.. రంగురంగుల లైట్లతో ఎంత బాగా మెరిసిపోతుందో?

Viral Video: కోడికి కొత్త రెక్కలు.. డ్రోన్‌తో ఎలా ఎగిరిందో చూడండి!

Central Jail: రాజభోగాలుగా సెంట్రల్ జైలు.. అండ‌ర్ ట్రయల్ ఖైదీ బర్త్ డే వేడుకలు, వీడియో వైరల్

Viral video: ఈ బుడ్డోడు జాతీయ గీతాన్ని ఎంత చక్కగా ఆలపించాడో.. మీరు కూడా చూసేయండి బ్రో, వీడియో మస్త్ వైరల్

Viral Video: బెడ్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎలుగుబంటి.. వెంటనే ఆ మహిళ ఏం చేసిందంటే?

Viral Video: ఫోన్ చూస్తూ డ్రైవింగ్.. రెప్పపాటులో ఘోరం, ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

iPhone Kidney: కిడ్నీ అమ్మేసి మరీ ఐఫోన్ కొన్నాడు.. ఇప్పుడు ఆస్పత్రిలో దయనీయ స్థితిలో..

Big Stories

×