Anjana Devi Health: ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తల్లి అంజనా దేవి(Anjana Devi) అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలయ్యారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనగా మారిన సంగతి తెలిసిందే. ఎంతో ఆరోగ్యంగా ఉన్న అంజనా దేవి ఉన్నఫలంగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం అపోలో హాస్పిటల్ కి తరలించారు అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆయన కొడుకులు చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ హుటా హుటిన తమ పనులను పక్కనపెట్టి హైదరాబాద్ వెళ్లినట్లు తెలిపారు. తాజాగా అంజనాదేవి ఆరోగ్యం గురించి వస్తున్నటువంటి వార్తలపై మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) స్పందించారు. ఈయన అధికారక ఎక్స్ ఖాతా ద్వారా తన తల్లి ఆరోగ్యం గురించి స్పందిస్తూ… “అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది”. అమ్మ ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారం బయటకు వచ్చిందని, ఆమె ఆరోగ్యపరంగా పూర్తిగా క్షేమంగా ఉన్నారు అంటూ నాగబాబు క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్ చేరుకున్న పవన్…
ఇలా అంజనా దేవి అనారోగ్యానికి గురి కావడంతో తన చిన్న కుమారుడు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. అయితే నేడు చంద్రబాబు సమక్షంలో క్యాబినెట్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో తన తల్లి అనారోగ్యానికి గురయ్యారనే విషయం రావడంతో క్యాబినెట్ మీటింగ్ ఇంకా మొదలుకాకుండానే ఈయన తన పనులన్నీ పక్కనపెట్టి హుటాహుటిన హైదరాబాద్ వచ్చారనే వార్తలు రావడంతో అందరూ ఆందోళన చెందరు. ఇక నాగబాబు క్లారిటీ ఇవ్వడంతో ఒక్కసారిగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
వయసు పైబడటంతో..
అంజనాదేవి వయసు పైబడుతున్న నేపథ్యంలో ఆమె బహుశా జనరల్ చెకప్ కోసం హాస్పిటల్ కి తరచూ వెళ్లి వస్తుంటారు. గతంలో కూడా ఇలా జనరల్ చెకప్స్ కోసం ఆమె హాస్పిటల్ కి వెళ్లడంతో అనారోగ్యానికి గురయ్యారు అంటూ అప్పట్లో కూడా ఇలాంటి వార్తను పెద్ద ఎత్తున వైరల్ చేశారు. ఆ క్షణం కూడా తన ఆరోగ్యం గురించి మెగా కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. ఇక అంజనమ్మకు సంబంధించిన కొన్ని వీడియోలను ఉపాసన ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు..
అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది.
There is some inaccurate information being circulated,but she is absolutely fine.— Naga Babu Konidela (@NagaBabuOffl) June 24, 2025
ఇటీవలే అత్తమ్మాస్ కిచెన్ అంటూ తన అత్తయ్య తన అమ్మమ్మతో కలిసి కొత్త బిజినెస్ ప్రారంభించిన ఉపాసన ఎప్పటికప్పుడు తన అత్తయ్య సురేఖ తన అమ్మమ్మ అంజనాదేవితో కలిసి ఉన్న వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోలలో అంజనాదేవి ఎంతో యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. ఇలా ఈమె ఆరోగ్యపరంగా బాగున్నారని క్లారిటీ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంచనాదేవి వెంకట్రావు దంపతులకు ఐదుగురు సంతానం అనే విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరు అమ్మాయిలు కాగా ముగ్గురు అబ్బాయిలు . ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ ముగ్గురు కూడా సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాలలోనూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Rea: వామ్మో ఈ యాంకర్ సంపాదన మామూలుగా లేదే..ఒక్క షోకు రూ. 195 కోట్లు!