Actor Anchor: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలకు ఏమాత్రం స్టార్ డం వచ్చినా రెమ్యూనరేషన్(Remuneration) మాత్రం 100 కోట్లు ఉంటుందని చెప్పాలి. ఇలా ఇటీవల కాలంలో ఒక్కో హీరో ఒక సినిమాకు ఏకంగా 100 కోట్లు ,150 కోట్లు అంటూ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇలా హీరోలు సినిమా కోసం దాదాపు రెండు మూడు సంవత్సరాలు కష్టపడుతూ ఉంటారు, అలా వారి కష్టానికి తగ్గ ఫలితం వారు అందుకుంటున్నారు. అయితే యాంకర్లు కూడా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ యాంకర్ మాత్రం ఇండియాలోనే రిచెస్ట్ యాంకర్ అని చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ హీరోలైన ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోలు కూడా తీసుకోని రెమ్యూనరేషన్ ఈయన తీసుకుంటున్నారు. మరి ఆ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న యాంకర్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే…
కపిల్ శర్మ..
బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కపిల్ శర్మ (Kapli Sharma)ఒకరు. ఈయన ఇప్పటికే బుల్లితెరపై ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ తన మాట తీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక కపిల్ శర్మ నెట్‌ఫ్లిక్స్ (Net Flixs) వేదికగా నిర్వహిస్తున్న ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో(The Great Indian Kapil Show) కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తుందని చెప్పాలి. ఇప్పటికే ఈ కార్యక్రమం మూడవ సీజన్ ప్రసారం కావడంతో మొదటి ఎపిసోడ్ లో భాగంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
స్టార్ హీరోలకు సాధ్యం కాదుగా…
ఇక ఈ షో2024 లో ప్రారంభం అయ్యింది. కేవలం 16 నెలల కాలంలో ఈ కార్యక్రమం 3 సీజన్లు ప్రసారం కావడంతో ఈ షోకు ఏ స్థాయిలో ఆదరణ లభించినదో స్పష్టం అవుతుంది. అయితే ఈ కార్యక్రమం కోసం కపిల్ శర్మ ఇప్పటివరకు ఎవరు తీసుకోని విధంగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. మరి ఈ కార్యక్రమం కోసం ఈయన తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత ఏంటి అనే విషయానికి వస్తే…ప్రతి సీజన్ 13 ఎపిసోడ్లను నిర్వహిస్తూ వచ్చారు. అయితే ప్రతి ఎపిసోడ్ కి కపిల్ శర్మ ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తుంది. ఇలా ఎపిసోడ్ కు 5 కోట్లు అంటే ప్రతి సీజన్ కు ఈయన 65 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది.
రిచెస్ట్ యాంకర్…
ఇలా 16 నెలల కాలంలో మూడు సీజన్లకు కలిపి ఈయన ఏకంగా 195 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఈ ఒక్క షో ద్వారా తీసుకున్నారని తెలుస్తోంది. అయితే స్టార్ హీరోలు కూడా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోలేదు. స్టార్ హీరో ఒక సినిమా చేయాలి అంటే దాదాపు రెండు మూడు సంవత్సరాలు పడుతుంది. కానీ కపిల్ శర్మ మాత్రం 16 నెలల వ్యవధిలోనే 195 కోట్లు అంటే ఈయన సంపాదన ముందు హీరోలు కూడా పనికిరారు. ప్రస్తుతం ఈయన అందుకుంటున్న ఈ రెమ్యూనరేషన్ గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.
Also Read: శ్రీకాంత్ ను ఇండస్ట్రీలో తొక్కేయాలని చూశారా… తెర వెనుక ఇంత జరిగిందా?