Sri Ram Drugs Case: డ్రగ్స్ కేసు (Drugs Case)లో తమిళ నటుడు శ్రీరామ్ (actor sri ram) అరెస్టైన విషయం తెలిసిందే. ఈయన గత కొంతకాలంగా డ్రగ్స్ కొనుగోలు చేస్తూ డ్రగ్స్ వాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఈయనని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా అరెస్టు చేసిన అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు నుంగంబాక్కం పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. అయితే ఈ వ్యవహారంలో భాగంగా నటుడు శ్రీరామ్ కు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. సుమారు తొమ్మిది గంటల పాటు ఈయనను పోలీసులు విచారణ చేశారు. ఈ విచారణలో భాగంగా ఎన్నో విషయాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు.
జులై 7 వరకు రిమాండ్…
మాజీ ఏఐడీఎంకే నేత ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు రావడంతో శ్రీరామ్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విచారణ అనంతరం ఈయనని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా,14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ (judicial custody) విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. దీంతో జులై 7వ తేదీ వరకు ఈయనకు రిమాండ్ విధించారు. ఇలా తనకు జైలు శిక్ష పడటంతో నటుడు శ్రీరామ్ బెయిల్ కావాలని కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది.
అనారోగ్య సమస్యలతో…
డ్రగ్స్ కేసులో భాగంగా అరెస్ట్ అయిన హీరో శ్రీరామ్ మొదటిసారి మీడియాతో మాట్లాడారు. తాను ఎలాంటి డ్రగ్స్ అమ్మలేదని, తనకు తెలిసిన వారి నుంచి మత్తు పదార్థాలను కొనుగోలు చేశానని తెలియజేశారు. ఇలా తాను మత్తు పదార్థాలను కొనుగోలు చేయడం తప్పేనని చేసిన తప్పును ఒప్పుకున్నారు. ఇక తనకు రిమాండ్ విధించడం పై ఈయన కోర్టును అభ్యర్థిస్తూ తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం తన బిడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, తనకు సంరక్షకుడిగా బిడ్డ బాధ్యత పూర్తిగా నాపై ఉందని అందుకే తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. మరి ఈయన అభ్యర్థనపై కోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది.
బెయిల్ కోసం….
ఇక హీరో శ్రీరామ్ తో పాటు మరికొంతమంది తమిళ హీరోలు కూడా డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది. ఇక ఈయన కెరియర్ విషయానికి వస్తే.. చిన్నప్పుడు సినిమాలపై ఆసక్తితో తిరుపతి నుంచి చెన్నై వెళ్లిన శ్రీరామ్ శ్రీకాంత్ గా ఉన్న తన పేరును కాస్త శ్రీరామ్ గా మార్చుకొని సినీ ప్రయత్నాలు చేశారు. “రోజాపూలు” అనే సినిమాతో హీరోగా అవకాశం అందుకున్న శ్రీరామ్ “ఒకరికి ఒకరు” సినిమాతో హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా పలు సినిమాలలో నటిస్తున్న శ్రీరామ్ కొంతకాలం పాటు సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చారు. అయితే ఇటీవల “హరికథ” అనే వెబ్ సిరీస్ ద్వారా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టిన సమయంలోనే ఈయన డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో ఈ విషయం కాస్త తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: అంజనా దేవి హెల్త్ అప్డేట్… నాగ బాబు ఏం అన్నాడంటే ?