Jio IPO: అపరకుబేరుడు రిలియన్స్ అధినేత ముఖేష్ అంబానికి పట్టిందల్లా బంగారమే. లేటెస్ట్‌గా జియో ఐపీవో లిస్టింగ్‌తో అంబానీ అండ్ ఫ్యామిలీ ఫుల్ ఖుషీగా వున్నారు. ముంబైలో గ్రాండ్‌గా సెలబ్రేషన్ కూడా నిర్వహించారు. ఐతే ఎప్పుడూ లాభాల పంటను చూసే వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యధినేత కంట కన్నీరు చూసి అంతా షాకయ్యారు. అది కన్నీరు కాదు. పుత్రోత్సాహంతో గుండె నుంచి ఉబికి వచ్చిన పన్నీరు కూతురు ఈషా అంబానీ అనంత్ అంబానీ ప్రసంగాలకు ముఖేష్ అంబానీ మనసు ఆనందబాష్పాలు రాల్చింది ఇలా..
ముఖేష్ అంబానీ 20 ఏళ్ల వయసున్నప్పుడు రిలయన్స్ తొలి పబ్లిక్ ఇష్యూలో భాగమైన రోజులను గుర్తుచేశారు ఈషా . తన తాత ధీరూభాయ్ అంబానీ కలలు కన్నట్టుగా రిలయన్స్‌ను సామాన్య ప్రజలకు చేరువ చేసేందుకు తన తండ్రి ఎంతో కృషి చేశారన్నారు. ఇక అనంత్ అంబానీ తమ కుటుంబ వారసత్వాన్ని, జియో ప్రయాణంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని తన తండ్రి పడిన తపన గురించి చెప్పారు. నాన్న మార్గదర్శకత్వం, తల్లి నేర్పిన నైతిక విలువలు, తాతయ్య కలలు.. తమకు స్ఫూర్తి అన్న అనంత్ మాటలకు నీతా, ముఖేష్ కళ్లు ఆనందంతో చెమర్చాయి.
Also read: బంజారాహిల్స్ పీఎస్‌లో ఏసీబీ దాడుల కలకలం.. 10 లక్షల లంచంతో దొరికిపోయిన ఎస్సై!
మాతృదేవ భవ..పితృదేవ.. ఆచార్య దేవో భవ అన్న మాటలకు ఈషా, అనంత్ ప్రసంగాలు అద్దం పట్టాయి. ఓనమాలు నేర్పాలని అనుకున్నా నాన్నా అందరంతా ఎదిగిన మిమ్మల్నిచూస్తున్నా కన్నా అన్నట్టుగా ముఖేష్, నీతా ఉద్వేగానికి గురయ్యారు. గుండెళ్లో వున్న ఆనందం వాళ్ల కళ్లలో కన్పించింది. క్షణం తీరికలేకుండా టైమ్ మిషిన్‌లా పరుగులు తీస్తారని నాన్నను కోపగించుకోలేదు. అంతులేని సంపద వెనక ఆయన అకుంఠిత దీక్షను అర్ధం చేసుకున్నారు. అలాగే పిల్లలతో గడపడానికి టైమ్ ఇవ్వకపోవచ్చు. కానీ తన మనసంతా వాళ్లే నని కన్నీళ్ల ద్వారా చాటి చెప్పారు అంబానీ.
జియో ప్లాట్‌ఫామ్స్ దలాల్ స్ట్రీట్‌లో తమ మార్క్ చూపాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో ఐపీఓ ధరతో పోలిస్తే షేర్లు 21 శాతానికి పైగా ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. ఆ నేపథ్యంలో ఈవెంట్ నిర్వహించారు, లాభాల పంటతో పాటు నాన్న కంట ఆనందాల కన్నీరు ఈ వేడుకలో హైలైట్‌గా నిలిచింది. ధనికా పేదనా కాదు నాన్నంటే నాన్నే మరి.
Also read: కూల్‌డ్రింక్‌లో మత్తు కలిపి యువతిపై లైంగిక దాడి.. ఎక్కడంటే?