Chiranjeevi tribute: భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించి, పల్లెటూరి కథలకు వెండితెరపై జీవం పోసిన గొప్ప దర్శకుడు, ‘ఇయక్కునర్ ఇమయం’ భారతీరాజా మరణం సినీ రంగానికి తీరని లోటు. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన శ్రద్ధాంజలి ఘటించారు.
Read also-HBD Balayya : బాలనటుడు టు లెజెండ్.. బాలయ్య ఆస్తులు ఎన్ని కోట్లంటే..?
చిరంజీవి తన ట్వీట్‌లో భారతీరాజా గారి గొప్పతనాన్ని కొనియాడుతూ.. భారతీయ సినిమా ఒక అద్భుతమైన కథకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు “పల్లెటూరి మట్టి వాసనను, మానవ సంబంధాల అందాలను, అమాయకపు ప్రేమని, సగటు మనుషుల భావోద్వేగాలను వెండితెరపై కాలాతీత సినిమా కవిత్వంగా మార్చిన ఘనత ఆయనది” అని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన సినిమాలు కోట్ల మంది హృదయాలను తాకడమే కాకుండా, ఎందరో భావి దర్శకులకు స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు.
భారత ప్రభుత్వం నుంచి లభించిన ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారం, ఆయన అందుకున్న పలు జాతీయ చలనచిత్ర అవార్డులు భారతీయ సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలకు నిదర్శనాలని గుర్తుచేశారు.
దర్శకుడిగా భారతీరాజాతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని, వృత్తిపరమైన అనుభవాలను చిరంజీవి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 1987లో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ హిట్ చిత్రం ‘ఆరాధన’ లో చిరంజీవి కథానాయకుడిగా నటించారు.
ఆ చిత్రంలో తాను పోషించిన ‘పులిరాజు’ పాత్రను గుర్తుచేస్తూ.. ఆయన దర్శకత్వంలో పనిచేసే భాగ్యం కలగడం తన అదృష్టమని చిరంజీవి అన్నారు. సినిమాపై భారతీరాజా గారికి ఉన్న అంతులేని మక్కువ, ఆయనలోని సరళత్వం, పని పట్ల ఆయనకున్న అంకితభావం తనపై చెరగని ముద్ర వేశాయని భావోద్వేగానికి లోనయ్యారు.
భారతీరాజా భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సృష్టించిన అద్భుతమైన చిత్రాల ద్వారా ఆయన లెగసీ ఎప్పటికీ సజీవంగానే ఉంటుందని చిరంజీవి అన్నారు. “ఇయక్కునర్ ఇమయం” భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, కోట్లాది మంది అభిమానులకు చిరంజీవి తన గాఢ సానుభూతిని తెలియజేశారు. ‘ఓం శాంతి’ అంటూ తన సందేశాన్ని ముగించారు.
చిరంజీవి చేసిన ఈ భావోద్వేగ ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇరు పరిశ్రమల మధ్య ఉన్న బంధాన్ని, భారతీరాజాతో మెగాస్టార్‌కు ఉన్న గురు-శిష్యుల వంటి అనుబంధాన్ని ఈ పోస్ట్ ప్రతిబింబిస్తోంది.
Indian cinema has lost one of its greatest storytellers, #Bharathiraja garu.
He transformed the fragrance of village soil, the beauty of human relationships, the innocence of love, and the emotions of ordinary people into timeless cinematic poetry. His films touched millions of… pic.twitter.com/MdoUfpztji
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2026