Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా రోజులవుతుంది. ఈయన చివరిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించిన భోళా శంకర్(Bhola Shankar) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది దీంతో మెగా అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ట (Vasista)దర్శకత్వంలో విశ్వంభర (Vishwambhara) అనే సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా ఒక స్పెషల్ సాంగ్ మినహా మిగిలిన షూటింగ్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది.
పుట్టినరోజు స్పెషల్…
నిజానికి విశ్వంభర సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రావాల్సిందిగా ఆ సమయంలో రాంచరణ్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో వాయిదా పడింది. ఇలా ప్రతిసారి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా కచ్చితంగా చిరంజీవి పుట్టినరోజు (Birthday)సందర్భంగా విడుదల చేస్తారని అందరూ భావించారు. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుందని ఎదురుచూసిన అభిమానులకు చిత్ర బృందం తీవ్ర నిరాశను కలిగించారని తెలుస్తోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర సినిమా వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవని తెలుస్తోంది.
మరోసారి వెనక్కి వెళ్లిన విశ్వంభర?
ఈ సినిమా విడుదల గురించి అధికారకంగా తెలియజేయకపోయినా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన స్టాలిన్(Stalin) సినిమాని తిరిగి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆగస్టు 22వ తేదీ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో అదే రోజున స్టాలిన్ సినిమాని 4 కే వర్షన్ లో విడుదల చేయబోతున్నట్లు అధికారకంగా తెలియజేశారు. ఇలా స్టాలిన్ తిరిగి విడుదల కాబోతుంది అంటే విశ్వంభర మరోసారి వాయిదా పడినట్లేనని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ సినిమా వరుసగా వాయిదా పడుతున్న నేపథ్యంలో అభిమానులలో ఎంతో నిరాశ ఎదురవుతుంది. వీలైనంత త్వరగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ తో పాటు విడుదల తేదీ గురించి కూడా అధికారికంగా తెలియజేస్తే బాగుంటుందని అభిప్రాయాలను తెలుపుతున్నారు.
స్టాలిన్ రీ రిలీజ్..
ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నటి త్రిష (Trisha)నటించిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈమె చిరంజీవితో కలిసి స్టాలిన్ సినిమాలో నటించారు. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకు ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక రాజకీయ నాయకుడు పాత్రలో కనిపించగా, కుష్బూ చిరంజీవికి అక్క పాత్రలో నటించారు. ఇలా 2006వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తిరిగి విడుదల చేయబోతున్నారు. చిరు పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర వస్తుంది అనుకుంటే ఆయన నటించిన స్టాలిన్ సినిమా రీ రిలీజ్ తోనే సరిపెడుతున్నారు. చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read: HHVM: చరిత్ర సృష్టించనున్న వీరమల్లు.. ఆ మల్టీప్లెక్స్ ప్రారంభ చిత్రంగా రికార్డ్!