Telangana Vehicle Rules 2025: మీ దగ్గర లారీ ఉందా? కారా? బైకా? అయితే ఒక్కసారి మీ వాహనం నెంబర్ ప్లేట్ దృష్టిగా చూసుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే కొత్త నిబంధనల ప్రకారం ఒక నిర్దిష్ట తేది తర్వాత పాత నెంబర్ ప్లేట్‌తో రోడ్డు మీదకి వస్తే, ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేయడం ఖాయం. ఇప్పుడే మీ వాహనం రిజిస్ట్రేషన్ ఎప్పుడయ్యిందో చెక్ చేసుకోండి. 2019 ఏప్రిల్ 1కి ముందు అయితే, హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ (HSRP) తప్పనిసరిగా ఉండాల్సిందే. లేదంటే మీ వాహనం ఖరీదైన మలుపులోకి వెళ్లే ప్రమాదం ఉంది.
మీరు తెలంగాణలో కార్ లేదా బైక్ యజమానులా? మీ వాహనం 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్టర్ అయి ఉందా? అయితే మీకు ఇది చాలా అవసరం. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ (HSRP) లేకపోతే సెప్టెంబర్ 30 తర్వాత మీ వాహనం నడిపితే భారీ జరిమానా మించదు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోపే కొత్త నెంబర్ ప్లేట్ మార్చుకోవడం వల్ల చట్టపరమైన చిక్కులనుంచి తప్పించుకోవచ్చు. వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణలో వాహనాల భద్రతను మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1, 2019కి ముందు రిజిస్టర్ అయిన అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ (HSRP) తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను అమలు చేయబోతోంది. ఇది కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా తీసుకున్న చర్య.
ఎందుకు HSRP అవసరం?
హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అనేది మాన్యువల్ ప్లేట్లకు భద్రతాపరంగా ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన నూతన సాంకేతికత. దీనివల్ల వాహన చోరీలు, తప్పుడు నంబర్ ప్లేట్లు వాడటం వంటి మోసాలను నియంత్రించవచ్చు. ఇకపై HSRP లేకుండా వాహనాలు నడిపితే వాటిని గుర్తించి కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది.
మార్చుకోవాల్సిన గడువు ఎప్పుడు?
తెలంగాణ RTA ప్రకారం, సెప్టెంబర్ 30, 2025కి ముందు మీ వాహనానికి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అమర్చాలి. అదే ప్లేట్ లేకుండా అక్టోబర్ 1 నుంచి రోడ్లపై కనిపిస్తే, అధికారులు జరిమానాలు వేయడం ఖాయం.
HSRP ఎలా బుక్ చేసుకోవాలి?
మీ వాహనానికి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ బుక్ చేసుకోవడానికి ఇలా చేయండి. ముందుగా https://bookmyhsrp.com వెబ్‌సైట్‌కి వెళ్లండి. మీ రాష్ట్రంగా తెలంగాణను ఎంచుకోండి. High Security Registration Plate with Colour Sticker అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. మీ వాహన వివరాలు రిజిస్ట్రేషన్ నెంబర్, చాసిస్ నెంబర్, ఇంజిన్ నెంబర్ నమోదు చేయండి. మీకు దగ్గరలో ఉన్న ఫిట్‌మెంట్ సెంటర్ లేదా హోమ్ డెలివరీ ఎంపిక చేయండి. రూ. 125/- నుండి ప్రారంభమయ్యే చార్జ్ చెల్లించండి. మీకు ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా నిర్ధారణ వస్తుంది. ప్లేట్‌ను డెలివరీ తీసుకొనేందుకు ఇక సిద్ధంగా ఉండండి.
Also Read: Naa Anvesh latest video: అంత దరిద్రమైన వీడియోస్ అవసరమా.. నా అన్వేష్ పై నెటిజన్స్ ఫైర్!
జరిమానాల వివరాలు
సెప్టెంబర్ 30 తర్వాత HSRP లేకుండా వాహనాలు రోడ్లపై నడిపితే, రూ. 500 నుంచి రూ. 1000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అలాగే వాహనాన్ని సీజ్ చేయడమూ జరుగుతుంది. ఇది మోటారు వాహన చట్టం ప్రకారం తప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇప్పుడు చేయాల్సిందేమిటి?
మీ వాహనం ఏప్రిల్ 1, 2019 కంటే ముందు నమోదు అయి ఉంటే, ఆలస్యం చేయకుండా వెంటనే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ బుక్ చేసుకోండి. అధికారుల చెక్‌పోస్ట్లు, ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవులు మొదలయ్యేలోపు ఈ ప్రక్రియను పూర్తిచేయడం మేలు.
ఇది ప్రజల భద్రత కోసమే
ఈ నిర్ణయం వాహనదారులపై భారం కాదు. ఇది మనకే రక్షణ. కారు లేదా బైక్ ఎక్కడా పార్క్ చేసినా లేదా ప్రయాణంలో ఉన్నా, HSRP ద్వారా చట్టబద్ధంగా రిజిస్టర్ అయిన వాహనం అని గుర్తించడం సులభం అవుతుంది.
తెలంగాణలో 2019 కంటే పాత వాహనాలకు కొత్త నెంబర్ ప్లేట్ తప్పనిసరి. సెప్టెంబర్ 30కి ముందు మార్పు చేసుకోకపోతే జరిమానా తప్పదు. అంతేకాదు, మీ భద్రత కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నారు. వెంటనే bookmyhsrp.com వెబ్‌సైట్‌కి వెళ్లి ప్లేట్ బుక్ చేసుకోండి.