Trolls on Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరోసారి యాంటి ఫ్యాన్స్‌కి టార్గెట్ అయ్యారు. నిన్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన చేసిన తప్పిదం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీ పెద్ద పేరుకేనా.. కనీసం జాతీయ జెండాను గౌరవించడం కూడా తెలియదా? అంటూ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకి అసలు విషయం ఏంటంటే.. నిన్న ఆగష్టు 15న సందర్భంగా పలువురు సినీ సెలబ్రిటీలు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా నిన్న తన చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను నిర్వహించారు.
పెద్దన్నకు అది కూడా తెలియదా!
ఈ సందర్భంగా ఆయన ఫ్లాగ్ హోస్ట్ జెండావందనం చేశారు. అయితే ఇది ప్రతీసారి చేస్తుందే కదా, ఈసారి కొత్తగా ఏముంది అంటున్నారు. ప్రతీ ఏడాది ఫ్లాగ్ హోస్టింగ్ చేసే చిరు.. కనీసం జాతీయ జెండాకు గౌరవం ఇవ్వడం తెలియదా యాంటి ఫ్యాన్స్ అంటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు అంటే దేశమంత ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల జ్ఞాపికగా జరుపుకునే వేడుక. మన జాతీయ జెండా అయిన త్రివర్ణ పతకాన్ని ప్రతి పౌరుడు గౌరవించాలి. దీని ముందు మెగాస్టార్ అయినా సామాన్య ప్రజలైన ఒక్కటే. ఎంతపెద్ద సెలబ్రిటీ అయినా, దేశ ప్రధానీ అయినా జాతీయ జెండాను గౌరవించాల్సిందే. ఎంతో పవిత్రంగా చూసే త్రివర్ణ పతాకం ముందు ప్రతిఒక్కరు చెప్పులు విప్పి జెండా వందనం చేస్తారు.
ఇది తప్పక పాటించాల్సిన నియమం. అదే మనం జాతీయ జెండాకు ఇచ్చే గౌరవం, స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే గౌరవ నివాళి. దేశ ప్రధానీ కూడా ఫ్లాగ్ హోస్టింగ్ చేసేటప్పుడు చెప్పులు విప్పి జెండావందనం చేస్తారు. కానీ, మెగాస్టార్ చీరు ఆ నియామాన్ని గాలికి వదిలేశారనిపిస్తోంది. నిన్న ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్న సమయంలో చిరంజీవి కాళ్లకు షూ ఉన్నాయి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి చారిటబుల ట్రస్ట్ రెండు ప్రాంతాల్లోనూ ఆయనే జెండా ఎగురవేశారు. ఎక్కడ కూడా ఆయన చెప్పులు తీయకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రెండు సమయాల్లోనూ ఆయన షూ వేసుకునే జెండా ఎగురవేశారు. ఆయన పక్కన నిలబడ్డ చాలామంది కూడా చెప్పులు విప్పారు.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
అల్లు అరవింద్ అలా.. చీరు ఇలా..
ప్రముఖ నిర్మాత, చిరంజీవి బావమరిది అయిన అల్లు అరవింద్ కూడా చెప్పులు తీసేసి జాతీయ జెండాను గౌరవించారు. కానీ, చిరు మాత్రం చెప్పులతోనే త్రివర్ణ పతాకం ఎగురవేసి.. కనీస నియమం కూడా పాటించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చిరును ట్రోల్ చేస్తున్నారు. మెగాస్టార్ లాంటి చిరంజీవే ఇలా చేస్తే.. సామాన్య ప్రజలు ఏం చేస్తారు. ఇండస్ట్రీ పెద్దగా చెప్పుకునే చిరంజీవికి ఆ మాత్రం నియమం తెలియదా. మనం ఎంతో గౌరవించే జాతీయ జెండాను చెప్పులతోనే వందనం చేశారంటే.. జాతీయ జెండా పట్ల ఆయనకు ఉన్న గౌరవం ఏపాటిదో తెలిసిపోతుందంటూ చురకలు పెడుతున్నారు. ప్రస్తుతం దీనిపై యాంటీ ఫ్యాన్స్, నెటిజన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు. మరి దీనిపై మెగాస్టార్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
Also Read: Mass Jathara : మేం భరించలేం… బయ్యర్ల దెబ్బకు మూవీ వాయిదా వేస్తున్న నిర్మాత ?