Mass Jathara Postponed: మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. ఆగస్టు 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటించింది. ఇక మొన్నటి వరకు ఈ తేదీగా మాస్ జాతరను తీసుకురావాలని మేకర్స్ కూడా ప్రమోషన్స్ షూరు చేశారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం విడుదల వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు. దీనికి కారణం మూవీ షూటింగ్‌కి ఇంకా కొంత బాకీ ఉందట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అనుకున్న టైం పూర్తి చేయలేకపోతున్నారనేది మూవీ టీం అంటున్న మాట. కానీ, సినీ సర్కిల్లో మరో మాట వినిపిస్తోంది. మాస్ జాతరను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్నారు.
బజ్ లేని ‘మాస్ జాతర’
దీనికి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ బ్యానర్లో వచ్చిన సినిమాలు వరుసగా నష్టాలు చూపిస్తున్నాయి. ఈ టైంలో మాస్ జాతర రిలీజ్ చేయడమంటే మళ్లీ నస్టాలు చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రవితేజ సినమా అంటే ఓ రేంజ్‌లో బజ్ ఉంటుంది. కానీ, మాస్ జాతర విషయంలో అదేమి కనిపించడం లేదు. ఇదోక సినిమా ఉందన్న విషయం సామాన్య ఆడియన్స్‌లో చాలా మందికి తెలియదు. మూవీ ప్రచార పోస్టర్స్‌తో కొస్తా బజ్ కనిపించింది. ఇటీవల విడుదల టీజర్ మాత్రం ఆ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపించలేదు. రవీతేజ మూవీ అప్‌డేట్ అంటే నెట్టింట జాతరే అన్నట్టు ఉంటుంది. కానీ, టీజర్ వచ్చినా.. అది ఆడియన్స్ పెద్దగా రీచ్ అయినట్టు కనిపించడం లేదు. మాస్ జాతరకు ప్రస్తుతం బజ్ కనిపించడం. పైగా దీనికి బడ్జెట్ కూడా బాగానే పెట్టారంట. ప్రస్తుతం వరుసగా నష్టాలు చూస్తున్న నాగవంశీ ఈ మూవీని విడుదల చేస్తే.. ఇంకా నష్టాలే వచ్చేలా ఉన్నాయి.. కానీ, దీనివల్ల ఆయన లాభం లేదంటున్నారు.
వాయిదా దిశగా నిర్మాత నిర్ణయం..
ఇటూ బయ్యర్లు కూడా ఇప్పుడు మాస్ జాతర రిలీజ్ అంటే భయపడుతున్నారట. కింగ్‌డమ్ మూవీ బ్లాక్‌బస్టర్ అవుతుందని అనుకున్నారు. కానీ, అంచనాలు తారుమారు అయ్యి ఈ చిత్రం నష్టాల్ని మిగిల్చింది. కనీసం బయ్యర్లను కాస్తా అంటే కాస్తా కూడా గట్టెక్కించలేకపోయింది. ఈ నష్టాల్ని పూడ్చడానికి నాగవంశీపై నమ్మకంతో వార్ 2ని కొన్నారు. ఇది కూడా ఫెయిట్యూర్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. ఈ సినిమా లాభాల్లో పడాలంటే రూ.81కోట్ల నెట్ రావాలి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది సాధ్యమయ్యేలా లేదు. వార్ 2 రిలీజ్‌కు ముందు నాగవంశీ బయ్యర్లకు ఓ కండిషన్ పెట్టి షాకిచ్చాడు. ఈ సినిమా నష్టాలైన, లాభాలైన బయ్యర్ల రెస్పాన్సిబిలిటీ.. తనకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు వార్ 2 నష్టాలు కూడా బయ్యర్లపైనే పడింది. దీంతో ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వస్తున్న మాస్ జాతరను కొనేందుకు బయ్యర్లు జంకుతున్నారట. పైగా సినిమా పెద్దగా టక్, బజ్ లేదు. ఇప్పుడు ఈ సినిమాను కొనేందుకు బయ్యర్లు సంకోచిస్తున్నారట.
అందుకే ఈ సినిమా వాయిదా వేయాలని నిర్మాత నాగవంశీని కోరుతున్నారట. కింగ్ డమ్, వార్ 2 నష్టాలే వచ్చాయి.. ఈసారి గట్టేక్కాలంటే కాస్తా టైం తీసుకుందామని అంటున్నారట. అందబుకే మాస్ జాతరను సెప్టెంబర్‌లో విడుదల చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారట. నిజానికి కింగ్‌డమ్ సెప్టెంబర్ విడుదల అవ్వాల్సింది. హరి హర వీరమల్లు మూవీ కోసం మూవి వాయిదా వేసి సెప్టెంబర్ రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వచ్చాయట. కానీ, అప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వడంతో వాయిదా వేయడం కరెక్ట్ కాదని జూలై 31నే విడుదల చేశారు. కానీ, ఈ సినిమా నిరాశ పరిచింది. కనీసం కింగ్‌డమ్‌వాయిదా వేసి ఉంటే.. సితారకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో అంటున్నారు. అప్పుడు తప్పక కింగ్‌డమ్ విడుదల చేస్తా.. ఇప్పుడు మాస్ జాతర వాయిదా వేయక తప్పడం లేదట నిర్మాత నాగవంశీకి.