Viral Video: పుత్తడి ధర ఆకాశానని తాకింది. రోజు రోజుకూ ఎగబాకుతూనే ఉంది. కరుడుగట్టిన నేరగాళ్లు, దొపిడీ దొంగల చూపు బంగారం షాపులపై పడింది. తాజాగా అమెరికాలోని సియాటెల్ సిటీలో కేవలం 90 సెకన్లలో బంగారం షాపుని లూటీ చేశారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది.
దోపిడీ దొంగల రూటు మారింది. ఒకప్పుడు గ్రామాలను టార్గెట్ చేసేవారు. ట్రెండ్ మారడంతో సిటీలు, పట్టణాలపై కన్నేశారు. ఎందుకంటే ఏ ప్రాంతంలో చూసినా బంగారు షాపులు కనిపిస్తున్నాయి. పైగా ధర ఎక్కువగా ఉండడంతో అటువైపు దృష్టి సారించారు. అలాంటి ఘటనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.
షాపులోకి ఎంట్రీ ఇవ్వడంతో క్షణాల వ్యవధిలో దోపిడీ చేసి పరారవుతున్నారు. అలాంటి ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. మినాషే అండ్ సన్స్ షాపులో పట్టపగలు బంగారం షాపు దోపిడీ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. కేవలం నలుగురు సభ్యుల కరుడు గట్టిన నేరగాళ్లు ముఖానికి ముసుగు వేసుకుని షాపులోకి ఎంట్రీ ఇచ్చారు.
కేవలం 90 సెకన్లలో షాపుని చక్కబెట్టేశారు. ఈ దోపిడీలో 2 మిలియన్ల డాలర్ల విలువ చేసిన వజ్రాలు, లగ్జరీ గడియారాలు, బంగారం, ఇతర వస్తువులను దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. తాళం వేసిన గాజు తలుపును సుత్తితో పగలగొట్టి, ఆరు డిస్ప్లే కేసులను దోచుకుంటున్నట్లు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ALSO READ: ప్రేయసితో ముసలి ప్రేమికుడి ఆన్‌లైన్ రొమాన్స్.. చివరకు ఆ విధంగా
దాదాపు $ 7,50,000 అమెరికా విలువైన రోలెక్స్ వాచీలు ఉన్నాయి. మరొక దానిలో $125,000 విలువైన పచ్చ నెక్లెస్ ఉంది. ముసుగు ధరించిన నిందితులు సెక్యూరిటీ, అందులో పని చేసిన కార్మికులను బేర్ స్ప్రే, టేజర్‌తో బెదిరించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. నార్మల్‌గా దోపిడీకి వచ్చేవారు షాపులోని ఉద్యోగులను కాల్చి డబ్బులు, వస్తువులు పట్టుకుని పోతారు.
కానీ ఇక్కడ ఎలాంటి కాల్పులు జరపకుండా కేవలం 90 సెకన్లలో తమ పని కానిచ్చారు. ఈ దోపిడీ అంతా షాపులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. షాపు యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. చోరీ జరిగిన తీరును పరిశీలించిన తర్వాత సీసీటీవీ ఫుటేజీ సాయంతో దొంగలను పట్టుకునేందుకు గాలింపు మొదలుపెట్టారు.
దోపిడీకి గురైన ఆభరణాలు విలువ అక్షరాలా రూ. 17 కోట్ల రూపాయలు. ఈ ఘటనతో షాపు యజమాని హడలిపోయారు. కొంతకాలం షాపు మూసివేస్తామని చెబుతున్నారు. ఎంత నష్టం జరిగిందనే జాబితాను ఉద్యోగులు రెడీ చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించామని ఈలోగానే జరగాల్సిన నష్టం జరిగపోయిందని అంటున్నారు పోలీసులు.
అన్నట్లు రీసెంట్‌గా హైదరాబాద్ చందానగర్‌లో షాపు ఓపెన్ చేసిన అరగంటలోపు దొంగలు ఎంట్రీ దోపిడీకి పాల్పడ్డారు. బంగారు ఆభరణాలు దోచుకుపోయారు. సిటీల్లో దోపిడీలు జరుగుతుండడంతో షాపు యజమానులు బెంబేలెత్తుతున్నారు.
NEW: Surveillance video shows the robbery of a jewelry store in West Seattle yesterday.
The suspects made off with more than $2-million in watches and jewels in 90 seconds. I'll talk with the owners on @komonews at 6.
STORY: https://t.co/rdPMq8kZQ6 pic.twitter.com/K8Tt4yacvG
— Jeremy Harris (@JeremyHarrisTV) August 15, 2025