E-Paper
Advertisement

Chiranjeevi: చిరంజీవి మెచ్చిన ఈ సీరియల్ నటి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Chiranjeevi: చిరంజీవి మెచ్చిన ఈ సీరియల్ నటి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే ఆయన తాజాగా ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా రూ.375 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు చిరంజీవి సినిమా కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో చేరింది. ఈ చిత్రం ఫిబ్రవరి 11 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఓటీటీ ఆదరణ కూడా ఈ చిత్రానికి బాగా లభించింది. ఒక్క రోజులోనే 200 మిలియన్ మినిట్స్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది ఈ సినిమా.

చిరంజీవి మెచ్చిన నటి..

ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత అటు సీరియల్ ప్రియులు కూడా ఈ సినిమా లోని ఒక సన్నివేశంకి బాగా కనెక్ట్ అవుతున్నారు. విషయంలోకి వెళ్తే.. “చిరంజీవి ఈ సినిమాలో ఒక సీరియల్ ను రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు. ఆ సీరియల్ లో నటించే హీరోయిన్ కి ఆయన కనెక్ట్ అవుతారు కూడా.. చిరంజీవి పాత్ర ఆ సీరియల్ గురించి, ఆ సీరియల్ లోని పాత్రల గురించి చెప్పడం, అతని జీవితాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నట్టుగా ఆ సీరియల్ సాగడం,” ఇది అటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇటు సీరియల్స్ ని ఇష్టపడే వాళ్లకు కూడా బాగా నచ్చింది. చిరంజీవి చూసిన సీరియల్ లో హీరోయిన్ సౌమ్య పాత్రలో నటించిన అమ్మాయి.. ఆయనకు ఇష్టమైన నటి కూడా.. మరి చిరంజీవి పాత్ర మెచ్చిన ఆ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవడానికి ఇప్పుడు అభిమానులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు.

ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

Advertisement

ఆమె పేరు సాయి ప్రియ రెడ్డి(Sai Priya Reddy). ఈమె తెలుగమ్మాయి కూడా.. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలోని సీరియల్ లో చిరంజీవి ఫేవరెట్ నటిగా సౌమ్య పాత్రలో నటించింది. సీరియల్ లో కనిపించిన ఈమె.. రియల్ లైఫ్ లో మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గానే తన కెరీర్ ను మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ రెబల్, మిర్చి, పూలరంగడు , నందీశ్వరుడు, క్షేత్రం, తడాఖా, జీనియస్ వంటి ఎన్నో చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె.. యూట్యూబ్లో పలు సీరీస్ లు కూడా చేసి మంచి పేరు తెచ్చుకుంది.

అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ఈమె ఇటీవల విశ్వక్ సేన్ లైలా, సందీప్ కిషన్ మజాకా చిత్రంలో కూడా నటించింది. ఇక ఇప్పుడిప్పుడే నటిగా సినిమాలలో బిజీ అవుతోంది. ఇకపోతే ఇదివరకు చిన్న చితక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. ఇప్పుడు చిరంజీవి ఫేవరేట్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకొని వెలుగులోకి వచ్చేసింది. మరి మునుముందు ఈమెకు నటిగా మరిన్ని అవకాశాలు లభించాలని ఆశిద్దాం.

Advertisement

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×