Tollywood Heros: సినీ స్టార్స్ సాధారణంగా సినిమాల్లో మాత్రమే కాదు. రియల్ లైఫ్ లో కూడా తోచిన సాయం చేస్తారు. ఎంతో మందికి ఎన్నో విధాలుగా సాయం చేసే ఉంటారు. మన తెలుగు హీరోలలో కొందరు హీరోలు సాయం కోరిన వారికి సాయం చెయ్యకుండా అస్సలు ఉండరు. అందులో స్టార్ హీరోలు అయిన చిరంజీవి, బాలయ్య అయితే చెప్పనక్కర్లేదు. ఎవరైన ఆపదలో ఉన్నారు అంటే వెంటనే సాయం చేస్తారు. ఇప్పటికే చాలా మందికి అండగా నిలిచి ఆదుకున్నారు.. ఇదిలా ఉండగా వీరిద్దరూ ఓ గ్రామానికి సాయం చేస్తామని మాట ఇచ్చి ఇప్పటికీ ఆ మాట నిలబెట్టుకోలేదని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ వాళ్లు ఏం మాట ఇచ్చారు అన్నది ఒకసారి తెలుసుకుందాం..
1993 లో ప్లేన్ క్రాష్..
ఈ మధ్య ప్లేన్ క్రాష్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. మొన్న అహ్మదాబాద్ లో జరిగిన భారీ విమాన ప్రమాదం జనాలకు మర్చిపోలేని సంఘటన.. ప్లేన్ గాల్లోకి ఎగిరిన కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఆ విమానంలో ఉన్న వాళ్లు మాత్రమే కాదు. అది ఓ మెడికల్ కాలేజీ పై పడింది. అందులోని విద్యార్థులు కూడా కాలి బూడిద అయ్యారు. ఈ ప్రమాదంలో 270 కి పైగా చనిపోయారు. అయితే ఇలాంటి ప్రమాదాలు గతంలో చాలానే జరిగాయి..1993 లో గుండ్ల పల్లెలో జరిగిన విమాన ప్రమాదాన్ని ఇప్పటికీ మర్చిపోలేరు. గ్రామం వైపు భారీ శబ్దం వచ్చింది. మాకు అది విమానం అని తెలియదు, వెంటనే పరుగులు తీశాము. విమానం పొలాల్లో ల్యాండ్ అయింది, దాదాపు అర కిలోమీటరు మేర భూమిపై రాసుకుంటు వెళ్ళిందని వాళ్లు అన్నారు. మేము విమానం దగ్గరకు వెళ్ళాము. కానీ వాళ్లు రానివ్వలేదు. ఫైలెట్ విమానాన్ని చాలా చాకచక్యంగా ల్యాండ్ చేశారు.అందరూ బురదలో చిక్కున్నారు, వారిని మేము గట్టుమీదకు తీసుకొచ్చాము అని అక్కడ ప్రజలు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
సాయం చేస్తామని మాట తప్పిన స్టార్స్..
ఈ విమాన ప్రమాదాన్ని టాలీవుడ్ ఎప్పటికి మర్చిపోదు. ఈ ఘటనలో బాలయ్య, చిరంజీవి, అల్లు రామలింగయ్య, దర్శకులు కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి తో పాటు మరికొందరు నటీమణులు ప్రమాద సమయంలో అందులో ఉన్నారట. వారందరికీ చిన్న గాయాలు కూడా తగిలాయట. ఆ టైం లో గ్రామస్తులు వారందరికీ షెల్టర్ కల్పించి తోడుగా ఉన్నారు. ఆ గ్రామస్తులు చేసిన పనికి మెచ్చుకున్న చిరంజీవి, బాలయ్య ఇద్దరు ఆ ఊరికి ఏదైన సాయం చెయ్యాలని అనుకున్నారట.. మీ ఊరు మమ్మల్ని కాపాడింది మీకు ఏమైనా చేస్తామని చిరంజీవి బాలకృష్ణ అడిగితే హాస్పిటల్ కట్టించాలని కోరాము. వాళ్ళు హామీ అయితే ఇచ్చారు కానీ మళ్ళీ ఇటువైపు ఎప్పుడు రాలేదన్నారు గ్రామస్తులు.. ఈ వార్త ఇప్పుడు మరోసారి హైలెట్ అయ్యింది. ఇది విన్న ఫ్యాన్స్, తదితరులు మాట చిన్న పల్లెటూరుకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయారు చిరంజీవి, బాలయ్య అని సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై ఆ హీరోలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.. ప్రస్తుతం వీరిద్దరు కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుసగా సినిమాలను చేస్తున్నారు..