BigTV English

Viral family: కాబోయే కోడలితో మామ.. అల్లుడితో అత్త జంప్.. ఎక్కడో కాదు బాస్ ఇక్కడే!

Viral family: కాబోయే కోడలితో మామ.. అల్లుడితో అత్త జంప్.. ఎక్కడో కాదు బాస్ ఇక్కడే!

Viral family: ఏమై పోతోందో సమాజం.. ఏమో కానీ ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తే ఔరా అనిపించక మానదు. ఇలాంటి ఘటనలు చూస్తే ప్రేమ గుడ్డిది అనే మాటను కొందరు లేవనెత్తుతున్నారు. అయితే ఇలాంటి ఘటనలు ఇటీవల వెలుగులోకి రాగా, అందరూ ఔరా అనేస్తున్నారు. ఇంతకు అవేమిటో మీరు తెలుసుకుంటే షాక్ కావాల్సిందే.


ఇటీవల చోటుచేసుకున్న రెండు కుటుంబ సంఘటనలు సామాజిక విలువలు, భావోద్వేగాలను కుదిపేశాయి. పెళ్లిళ్లు జరిగే ముహూర్తాన మరొకరి ప్రేమలో పడటం కేవలం సినిమాల్లో చూసే అంశం అనుకుంటే పొరపాటే. ఇక్కడ తండ్రే తన కొడుకు కోసం తీసుకెళ్లిన పెళ్లి సంబంధాన్ని తానే తనకు ముడిపెట్టుకున్నాడు. మరొకచోట తల్లి కూతురు పెళ్లి కుదిరిన అబ్బాయితో పారిపోయింది. వీటికి సంబంధించి వివరాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

కాబోయే కోడలితో ప్రేమాయణం
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన షకీల్ అనే వ్యక్తి తన 15 ఏళ్ల మైనర్ కొడుకు కోసం ఒక యువతిని వివాహానికి చూడటానికి వెళ్లాడు. మొదట తానే కొడుకుకు ఆ సంబంధం కుదిర్చాడు. కానీ కొద్దిరోజుల్లో షకీల్‌ ఆ యువతితోనే ప్రేమలో పడిపోయాడట. భార్య షబానా వెల్లడించిన వివరాల ప్రకారం.. తన భర్త ఆ యువతితో తరచూ వీడియో కాల్స్ చేసేవాడని, రోజంతా ఫోన్‌లోనే ఉండేవాడని చెబుతోంది. మొదట ఎవ్వరు తన మాటలు నమ్మలేదట. కానీ ఆమె కొడుకుతో కలిసి ఆధారాలు సేకరించినట్లు పేర్కొంది. అలా ఆమె సంచలన విషయాన్ని వెలికితీసింది.


పిల్లలతో సహా షబానా ఈ వ్యవహారంపై నిలదీసినప్పుడు షకీల్ తీవ్రంగా ప్రతిస్పందించాడని, కుటుంబ సభ్యులను కొట్టాడని ఆమె ఆరోపించింది. ఇకపై ఈ పెళ్లిని కొనసాగించలేనని భావించిన ఆమె కొడుకు తనే సంబంధాన్ని వదులుకున్నాడు. మరింత ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, షకీల్ తన భార్య, పిల్లలను వదిలిపెట్టి రూ.2 లక్షల నగదు, సుమారు 17 గ్రాముల బంగారంతో ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ వివాహానికి కొందరి కుటుంబ సభ్యుల సహకారమూ ఉందని సమాచారం.

Also Read: Rainfall Update: తెలుగు రాష్ట్రాల్లో వర్షాల అప్ డేట్.. ఇక్కడ ఫుల్.. అక్కడ నిల్!

కాబోయే అల్లుడితోనే..
ఇంతలో అలీఘర్‌కు చెందిన మరో కేసు వెలుగులోకి వచ్చింది. శివాని అనే యువతి తనకు కుదిరిన సంబంధాన్ని ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. కానీ పెళ్లి తేదీ దగ్గరపడుతుండగా, ఆమె తల్లి అనిత తన కాబోయే అల్లుడు రాహుల్‌తో పారిపోయింది. పెళ్లి ముహూర్తానికి పదిరోజుల ముందు జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.

శివాని మాటల్లో చెప్పాలంటే.. ఏప్రిల్ 16న నాకు రాహుల్‌తో వివాహం జరగాల్సి ఉంది. కానీ నా తల్లి అనిత ఏప్రిల్ 6న అతనితో పారిపోయింది. వారిద్దరూ గత కొన్నిమాసాలుగా ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడేవారు. మొదట్లో అంతగా గుర్తించలేదు. కానీ ఇప్పుడు అసలు నిజం తెల్సిందని శివాని అంటోంది.

ఈ కేసులో మరో పాయింట్.. = అనిత ఇంట్లో ఉన్న రూ.3.5 లక్షల నగదు, రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను తీసుకెళ్లిందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివాని తండ్రి జితేంద్ర కుమార్ మాట్లాడుతూ.. నేను బెంగళూరులో వ్యాపారం చేస్తున్నాను. మా ఇంట్లో జరుగుతున్న ఈ పరిణామాలు వినీ షాక్ అయ్యాను. పెళ్లి దగ్గర పడుతోంది కాబట్టి ఎలాంటి అనుమానాలు వ్యక్తీకరించకుండా మౌనంగా ఉన్నాను. కానీ అనుకున్న దానికంటే భయంకరంగా మోసం జరిగిందన్నారు. =

ఈ రెండు సంఘటనలూ సమాజంలో పెళ్లిళ్లకు సంబంధించిన భావాలను పూర్తిగా ఎదురు దిశలో మార్చేలా ఉన్నాయి. తండ్రి తన కొడుకు కాబోయే భార్యను పెళ్లి చేసుకోవడం, తల్లి కూతురు కాబోయే భర్తతో పారిపోవడం.. ఇవి కేవలం కుటుంబ పరాజయాలే కాదు, భావోద్వేగాల, నైతిక విలువల మౌలిక బలహీనతను చూపిస్తున్న ఉదాహరణలు.

ఈ ఘటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఆ కుటుంబాలపై సమాజం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రేమ అనేది ఎవరి విషయంలోనూ తప్పు కాదు, కానీ అది ఎవరికి గాయాన్ని కలిగించకుండా, కుటుంబ విలువలను కాపాడే రీతిలో ఉండాలి అనే భావన మరలా చర్చకు వస్తోంది.

Related News

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Viral Video: దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజూ ఏకంగా 8 లీటర్లు!

Viral Video: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Viral Video: రోడ్డు మధ్యలో కారు ఆపి.. హస్త ప్రయోగం.. ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా?

Big Stories

×