Movie Tickets:సినిమా విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ పెట్టడం అనేది సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణం. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటే అడ్వాన్స్ బుకింగ్స్ లో టాప్ లేచిపోద్ది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది అనేది అర్థం అయిపోతుంది. ఇక చిన్న సినిమాలకైతే అంత అంత మాత్రంగానే ఉంటాయి. కానీ పేరున్న హీరోలు.. పేరున్న దర్శకులు తీసే సినిమాలకు ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఉండడంతో పాటు వీళ్ళ సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తారు. అయితే ఒక సినిమా విడుదలయ్యే ముందు అడ్వాన్స్ బుకింగ్స్ నెల, రెండు నెలలు, మహా అయితే మూడు నెలల ముందు నుండి స్టార్ట్ అవుతాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ సినిమాకి మాత్రం ఏకంగా సంవత్సరం ముందు నుండే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయట.
ఏడాది ముందే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు..
ఇదేంటి విడుదలకు ఇంకా సంవత్సరం ఉంటే ఇప్పటినుండే టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడమేంటని మీ అందరిలో ఒక డౌట్ కలగొచ్చు. అలాగే ఇది ఫేక్ న్యూస్ అని కూడా అనుకోవచ్చు. కానీ ఇది ఫేక్ కాదు రియల్.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా వచ్చే సంవత్సరం జూలై 17న విడుదల కాబోతుంది. కానీ ఈ సంవత్సరం జూలై నుండే అంటే సంవత్సరం ముందు నుండే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటంటే ‘ది ఒడిస్సీ'(The Odissey) . ఈ సినిమాకి ఎందుకంత ప్రత్యేకత.. సంవత్సరం ముందు నుండే అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్లు హాట్ కేకుల్లా ఎందుకు అమ్ముడైపోతున్నాయని మీ అందరికీ మరో డౌట్ కూడా రావచ్చు. అయితే ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోవడానికి కారణం పేరున్న దర్శకుడే.. మరి ఆ డైరెక్టర్ ఎవరో కాదు క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan). ఈ పేరు చెబితే తెలియని వాళ్ళు ఉండరు.. ప్రపంచంలో ది గ్రేట్ డైరెక్టర్ లలో క్రిస్టోఫర్ నోలన్ ఒకరు.
హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న టికెట్లు..
ఇప్పటికే ఈయన దర్శకత్వంలో వచ్చిన ఓపెన్ హైమర్ (Oppenheimer), ఇంటర్ స్టెల్లార్(Inter Stellar), మెమెంటో (Memento), ఇన్సెప్షన్ (Inception) వంటి అద్భుతమైన సినిమాలు తెరకెక్కాయి. అలా స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో ప్రస్తుతం ది ఒడిస్సీ మూవీ వస్తుంది. దాదాపు 700 సంవత్సరాల క్రితం హోమర్ రాసిన కథ ఆధారంగా ది ఒడిస్సీ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు మాట్ డామన్ (Mat Damon) టైటిల్ రోల్ పోషించగా..స్పైడర్ మాన్ హీరో టామ్ హలాండ్(Tom Holland), అన్నా హత్వే (Anne Hathawey) వంటి వాళ్ళు కీ రోల్స్ పోషిస్తున్నారు.
70mm స్క్రీన్ లోనే..
అయితే ఈ సినిమా కి అడ్వాన్స్ బుకింగ్స్ కేవలం ఐమాక్స్ 70mm స్క్రీన్ లోనే స్టార్ట్ అయ్యాయి.ఎందుకంటే డైరెక్టర్ ఈ సినిమాని ఐమాక్స్ 70mm కెమెరా లో షూట్ చేయడం కారణంగా కేవలం ఐమాక్స్ 70 ఎంఎం స్క్రీన్ లోనే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అలా సంవత్సరం ముందు నుండే ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి.
also read:Jayam Ravi : 9 కోట్లు తిరిగి ఇచ్చేయండి… హై కోర్టును ఆశ్రయించిన జయం రవి!