Jayam Ravi :జయం రవి(Jayam Ravi) .. గత కొన్ని నెలలుగా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. హీరోగా పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన తాజాగా తన భార్య ఆర్తి (Arti) కి విడాకులు ఇస్తూ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ముఖ్యంగా సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ (Kenishaa Francis )తో రహస్యంగా ఎఫైర్ పెట్టుకోవడం వల్ల.. జయం రవి తన భార్య ఆర్తికి విడాకులు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే అటు ఆర్తి, జయం రవి విడాకులకు తనకు ఎటువంటి సంబంధం లేదని సింగర్ కెనీషా ఎంత చెప్పినా వార్తలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. దీనికి తోడు జయం రవి ఎక్కడ కనిపిస్తే అక్కడ కెనీషా ఉండడం.. అటు ఆర్తి పోస్టులకు కెనీషా రిప్లై ఇవ్వడం చూస్తూ ఉంటే నిజంగా జయం రవి, కెనీషా మధ్య ఏదో బంధం ఉందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
హైకోర్టును ఆశ్రయించిన జయం రవి..
ఇక అంతేకాదు ఇటీవల జయం రవి కెనీషా ఇద్దరూ వివాహం చేసుకున్నట్లు కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. ఇంతలా వ్యక్తిగతంగా వార్తల్లో నిలిచిన జయం రవి ఇప్పుడు మరొకసారి సినిమాల కారణంగా వార్తల్లో నిలిచారు తనకు రూ.9 కోట్లు తిరిగి ఇవ్వాలి అంటూ ఏకంగా ఒక చిత్ర నిర్మాణ సంస్థపై పిటిషన్ వేస్తూ హైకోర్టును ఆశ్రయించారు జయం రవి. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
జయం రవి పై పిటిషన్ దాఖలు చేసిన నిర్మాణ సంస్థ..
కోయంబత్తూరు కి చెందిన బాబీ గోల్డ్ టచ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా జయం రవి హీరోగా రెండు చిత్రాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకు గానూ ఆయనకి రూ.6కోట్లు అడ్వాన్స్ కూడా చెల్లించింది ఆ నిర్మాణ సంస్థ. అయితే జయం రవి తమ సంస్థకు చిత్రాలను చేయకుండా.. ఇతర చిత్రాలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో తాము ఇచ్చిన అడ్వాన్స్ ను వడ్డీతో సహా రూ.10 కోట్లు చెల్లించేలా ఆదేశించాలి అని, సదరు నిర్మాణ సంస్థ చెన్నై సిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
రివర్స్ పిటిషన్ వేసిన జయం రవి..
దీంతో జయం రవి కూడా ఏకంగా చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను కేటాయించిన కాల్ షీట్స్ ను బాబీ గోల్డ్ టచ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉపయోగించుకోలేదని, అయినప్పటికీ తాను మరో చిత్రం చేసి ఆ సంస్థ నుంచి తీసుకున్న అడ్వాన్స్ ను తిరిగి ఇస్తానని చెబుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే వారం రోజుల్లోనే అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలి అని, ఆ నిర్మాణ సంస్థ ఒత్తిడి చేసిందని కూడా తెలిపారు. ఇక తాను కేటాయించిన కాల్ షీట్స్ ని ఉపయోగించుకోకుండా తన సమయాన్ని వృధా చేసినందుకుగాను తనకు భారీ నష్టం కలిగిందని, వీరి సినిమాకి ఒప్పుకోవడం వల్ల తాను మరో సినిమా కాల్ షీట్స్ అందివ్వలేకపోయానని, అందుకు ఫలితంగా ఆ నిర్మాణ సంస్థకు రూ.9 కోట్లు నష్టపరిహారం చెల్లించాలి అని జయం రవి కోరారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
also read:Janhvi Kapoor: విడుదలకు ముందే మరో గౌరవాన్ని అందుకోబోతున్న జాన్వీ కపూర్ మూవీ!