E-Paper
Advertisement

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!
Advertisement

Chennai Love story:ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తన సొంత కష్టంతో టాలీవుడ్‌లో నిలదొక్కుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇటీవల థియేటర్లలోకి వచ్చి మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద సినిమాను మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చేందుకు చిత్ర యూనిట్ ఒక వినూత్నమైన ప్రమోషన్ ప్లాన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్‌ కోసం స్పెషల్ ఆఫర్ ప్రకటిస్తూ నెట్టింట హడావుడి చేస్తోంది..

ఉచిత టికెట్ల గివ్‌అవే ప్రమోషన్..

Advertisement

రవి నంబూరి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా జంటగా నటించిన ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘టికెట్స్ గివ్‌అవే’ ఆఫర్‌ను సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ కోసం 20 ఉచిత టికెట్లను ఇస్తున్నట్లు ప్రకటించారు. రీట్వీట్ చేసి, ఫాలో అయ్యే వారికి ఈ టికెట్లు సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. తమకు నచ్చిన థియేటర్, షో టైమ్ కామెంట్ చేస్తే చాలని టీమ్ పేర్కొంది.

also read:లైంగిక నేర బాధితురాలికి అండగా హైకోర్టు న్యాయవాది.. 200కు పైగా వీడియోలు!

నెగిటివ్ టాక్‌కు చెక్ పెట్టే ప్లాన్..

Advertisement

“సినిమా తీయాలి.. మళ్లీ ఇలా గివ్‌అవేలు ఇవ్వాలి.. ఏమి టైం సర్ ఇది!” అంటూ సోషల్ మీడియాలో కొంత ప్రచారం జరుగుతున్నా, ఈ ప్రమోషన్ స్టంట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నెగిటివ్ టాక్ వచ్చే సమయంలో గివ్‌అవేలు ఇస్తే ఆడియన్స్ వస్తారా?.. సినిమా బాగోలేదు కాబట్టే ఇలాంటి ఆఫర్లు పెడుతున్నారు అంటూ చిత్రబృందంపై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే మూవీ యూనిట్ మాత్రం ఆఫర్ పెట్టి.. థియేటర్లకు ఆడియన్స్‌ను రప్పించడానికి, హౌస్‌ఫుల్ బోర్డులు పడేలా చేయడానికి మూవీ టీమ్ ఇలాంటి గివ్‌అవే ఆఫర్లు ప్రకటిస్తోందని ఇన్ సైడ్ వర్గాలు అంటున్నాయి. జనాలు థియేటర్లకు వస్తే పాజిటివ్ టాక్ ఆటోమేటిక్‌గా స్ప్రెడ్ అవుతుందనేది వారి వ్యూహం.

డిస్ట్రిబ్యూటర్ల కోసమే ఈ వినూత్న ప్రయత్నం..

గత సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ‘చెన్నై లవ్ స్టోరీ’కి సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయని, మేకర్స్ అఫీషియల్ వసూళ్ల పోస్టర్లు కూడా రిలీజ్ చేశారని టాక్. అయితే ఈ సినిమాను ఎలాగైనా సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్లి, కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ఎలాంటి నష్టాలు రాకుండా చూడాలనే ఆరాటంతోనే హీరో కిరణ్ అబ్బవరం , టీమ్ ఇలాంటి వినూత్న పబ్లిసిటీ ప్లాన్‌ను అమలు చేస్తున్నారని తెలుస్తోంది.

ఆఫర్లతో ఆడియన్స్ వస్తారా?..

సినిమా ప్రమోషన్ల విషయంలో ప్రతీ చిన్న అవకాశాన్ని వాడుకుంటున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్ ప్లాన్ నిజంగానే ఆసక్తికరంగా మారింది. ఇక సోషల్ మీడియాలో ప్రకటించిన ఈ ఉచిత టికెట్ల గివ్‌అవే ఆఫర్ నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తోంది. మరి ఈ స్పెషల్ ఆఫర్లు, వినూత్న ప్రచార చిత్రాలు థియేటర్ల దగ్గర ఎంతవరకు వర్కవుట్ అవుతాయో, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తాయో వేచి చూడాలి.

Related News

మిర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్లు ఇక లాంఛనమేనా ?

హనుమాన్ అంష్ 2లో విరాట్–అనుష్క.. నిజమేనా?

ఏంటీ ట్రెండ్ మామా.. టాలీవుడ్ హీరోలంతా 80ల్లోనే!

‘జనవరి 12 విడుదల’ పక్కా బ్లాక్ బస్టర్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

పిల్లలు ఉన్నా.. లేకపోయినా ఒకే అనుకున్నాం..కానీ: సమంత

ఫౌజీ అసలు వస్తుందా? ప్రభాస్ సినిమా చుట్టూ పెరుగుతున్న సస్పెన్స్!

ఫ్యాన్స్ అంటే సెలబ్రేషన్స్ మాత్రమే కాదు..మనసులు గెలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్!

మనవడి కోసం నాగబాబు సంచలన నిర్ణయం!

Big Stories

Advertisement
×