E-Paper
Advertisement

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!
Advertisement

Chennai Love story: సినిమాలో పెద్ద స్టార్స్ లేకపోయినా కథ, కథనం కరెక్ట్ గా ఉంటే కాస్టింగ్ తో పని లేకుండా ఆ సినిమా సక్సెస్ అవుతుంది అని ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి. అయితే ఒక సినిమా ప్రేక్షకులను మెప్పించాలి అంటే కథా కథనంతో పాటు ఆ సినిమా ఆడియన్స్ కి కూడా చేరాలి. అందుకే సెలబ్రిటీలు పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు. గివ్ అవే అంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అంతేకాదు పెద్దపెద్ద ఈవెంట్లు చేస్తూ.. జనాలలోకి వెళ్తున్నారు. పైగా ఆడియన్స్ను థియేటర్ కి రప్పించడానికి వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్లతో పాటు వృద్ధులకు, లేడీస్ కి కూడా సపరేట్ ఫ్రీ టికెట్ అంటూ ఎన్నో ఆఫర్లను పెట్టి ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

సత్తా లేని ప్రమోషన్.. థియేటర్ హౌస్ ఫుల్ ఇక్కట్లు..

సినిమాలో బలం లేకపోతే ఎన్ని ఆఫర్లు పెట్టినా.. ఎంత ఆశ చూపెట్టినా.. తమకున్న బిజీ లైఫ్ స్టైల్ లో పనులను పక్కనపెట్టి సినిమా చూడడానికి వస్తారు అనేది ఒట్టి భ్రమ. ఈ మధ్యకాలంలో చిత్ర యూనిట్ వినూత్నంగా ఆలోచిస్తూ మౌత్ టాక్ తో ఆడియన్స్ థియేటర్ కు రప్పించాలని ఒకవైపు.. మరొకవైపు పోస్టర్లతో, సోషల్ మీడియా ప్రమోషన్స్ తో థియేటర్కు తీసుకురావాలనే తపన మరోవైపు.. అందులో భాగంగానే థియేటర్లు హౌస్ఫుల్ పడకపోయినా.. ఖాళీ థియేటర్లు దర్శనమిస్తున్నా.. సరే గ్రాఫిక్స్ వాడి మరీ హౌస్ ఫుల్ థియేటర్ల పేరుతో ఆడియన్స్ ను పిచ్చోళ్లను చేస్తున్నారు అంటూ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

Advertisement

ALSO READ:సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

చెన్నై లవ్ స్టోరీ కి హౌస్ ఫుల్ కష్టాలు..

ఇదిలా ఉండగా ఇప్పుడొచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీకి ఇలాంటి హౌస్ ఫుల్ కష్టాలే ఎదురవుతున్నాయి. సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయినా.. అప్పుడే పది కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు పోస్టర్లు వేసుకున్న చిత్ర బృందం.. మరొకవైపు థియేటర్లు ఖాళీగా ఉంటుంటే.. హౌస్ ఫుల్ బోర్డ్ లు పెట్టేస్తూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు. అయితే నిజం తెలిసిన నెటిజన్స్ ఊరుకుంటారా? ఈ ఫోటోలను కాస్త సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. చెన్నై లవ్ స్టోరీ మూవీ యూనిట్ ను ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.

సోషల్ మీడియాలో భారీ ట్రోల్స్..

Advertisement

ముఖ్యంగా ఒక ఎక్స్ యూజర్ చెన్నై లవ్ స్టోరీ ప్రదర్శితమవుతున్న థియేటర్లను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. థియేటర్ ఏంటి ఇంత ఖాళీగా ఉంది . ఎడిట్ చేయమంటావా ఫుల్ క్రౌడ్ తో అంటూ ఏకంగా ఈ చిత్ర నిర్మాత ఎస్ కే ఎన్ (SKN) ను ట్యాగ్ చేశారు. అంతేకాదు ఈ ఫోటోని మరొకరు రీ ట్వీట్ చేస్తూ..” అమ్మకాలేమో గంటకి పదివేల చొప్పున టికెట్లు అమ్ముడుపోతున్నాయి. కానీ థియేటర్ మొత్తం ఖాళీగా ఉంటున్నాయి. ఏం స్కాం రా నాయనా ఇది.. జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారా?” అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు. మరి దీనిపై చిత్ర బృందం ఏదైనా స్పందిస్తుందా అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

Related News

హనుమాన్ అంష్ 2లో విరాట్–అనుష్క.. నిజమేనా?

ఏంటీ ట్రెండ్ మామా.. టాలీవుడ్ హీరోలంతా 80ల్లోనే!

‘జనవరి 12 విడుదల’ పక్కా బ్లాక్ బస్టర్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

పిల్లలు ఉన్నా.. లేకపోయినా ఒకే అనుకున్నాం..కానీ: సమంత

ఫౌజీ అసలు వస్తుందా? ప్రభాస్ సినిమా చుట్టూ పెరుగుతున్న సస్పెన్స్!

ఫ్యాన్స్ అంటే సెలబ్రేషన్స్ మాత్రమే కాదు..మనసులు గెలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్!

మనవడి కోసం నాగబాబు సంచలన నిర్ణయం!

అప్పుడే ఏడాది..క్యూట్ పిక్ తో కొడుకుకి స్పెషల్ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్ !

Big Stories

Advertisement
×