Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల విచారణపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. జడ్జెస్ (ఇంక్వైరీ) ఆక్ట్- 1968 కింద ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్పీకర్ ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ సభ్యులుగా సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎం.ఎం. శ్రీవాస్తవ, కర్ణాటక హైకోర్టు సీనియర్ అడ్వొకేట్ వాసుదేవ ఆచార్యలు ఉన్నారు.
తీర్మానంపై 146 మంది ఎంపీలు సంతకం..
ఈ అభిశంసన తీర్మానంపై మొత్తం 146 మంది ఎంపీలు సంతకాలు చేశారు. దీంతో స్పీకర్ ఈ తీర్మానాన్ని స్వీకరించారు. కమిటీ తన నివేదకను వీలైనంత త్వరగా సమర్పించాలని ఆయన కోరారు. అవినీతికి సంబంధించిన పోరాటంలో పార్లమెంట్ ఎప్పుడూ నిజాయితీగా ఉంటుందని చెప్పారు. స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన కమిటీకి పలు కీలక అధికారులు కూడా అప్పగించారు. సాక్షులను పిలిపించుకుని ప్రశ్నించే అధికారం ఉంటుందని వివరించారు. విచారణను పూర్తి చేసి నివేదికను స్పీకర్ కు సమర్పించనున్నారు. ఆ తర్వాత వెంటనే సభలో ప్రవేశపెట్టి దాని ఓటింగ్ నిర్వహించనున్నారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, 217 ప్రకారం, ‘ప్రూవ్డ్ మిస్‌బిహేవియర్’ లేదా అసమర్థత కారణంగా జడ్జిని పదవిలో నుంచి తొలగించవచ్చు. జడ్జిపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి లోక్ సభలో కనీసం 100 మంది, రాజ్యసభలో అయితే కనీసం 50 మంది సభ్యులు సంతకం చేయాల్సి ఉంటుంది. రెండు సభల్లో ఎంపీలు నోటీసులు కూడా సమర్పించాలి. స్పీకర్ నోటీసును ఆమోదించిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు చీఫ్ జస్టిస్, ఒక ప్రముఖ న్యాయవేత్తతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ జడ్జెస్ (ఇంక్వైరీ) ఆక్ట్, 1968 ప్రకారం ఏర్పాటు చేస్తారు.
ALSO READ: SGPGIMS: 262 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా వేతనం, చివరి తేది ఇదే..