Secrete Behind Charan Number In Upasana Phone: మెగా కోడలు ఉపాసన గురించి తెలిసిందే. సినీ సెలబ్రిటీ కుటుంబంలో కోడలిగా వచ్చినా.. ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌లో సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) వైస్ చైర్‌పర్సన్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తునే.. మరోవైపు మెగా కోడలిగా తన మార్క్ చూపెడుతోంది. వ్యాపారవేత్తగానే కాదు సామాజీక సేవల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఆమె అందిస్తున్న సేవలను గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆమె కీలక బాధ్యతుల అప్పగించింది.
తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కు ఆమెను కో ఛైర్మన్ గా నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు తల్లిగా కూడా ఉపాసన తన బాధ్యతలను నిర్వర్తిస్తోంది. తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కు కో–చైర్మన్‌గా నియమాకమైన సందర్భంగా ఉపాసన ఇటీవల ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా తన భర్త, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫోన్ నెంబర్ ఏమని సేవ్ చేసుకుందో చెప్పింది. సాధారణంగా.. ఎవరైన భర్త నెంబర్ని భార్య హబ్బి, బేబీ, హస్పెండ్, స్వీట్హార్ట్, మై లవ్ అని సేవ్ చేసుకుంటారు.
చరణ్ ఫోన్ నెంబర్ ఎంటంటే..
కానీ ఉప్సీ మాత్రం చరణ్ నెంబర్ డిఫరెంట్‌గా సేవ్ చేసుకుంది. చరణ్ ఫోన్ నెంబర్ని తన ఫోన్లో రామ్ చరణ్ 200(Ram Charan 200) అని సేవ్ చేసుకుందట. నెంబర్ అలా సేవ్ చేసుకోవడం ఏంటని ప్రశ్నించగా.. గట్టిగా ఓ నవ్వు నవ్వి.. దానికి వెనక ఓ కథ ఉందంటూ అసలు విషయం బయటపెట్టింది. ప్రస్తుతం చరణ్ దగ్గర ఉన్న నెంబర్ 200వ ది అంట. ఇప్పటివరకు చరణ్ 200 నెంబర్స్ మార్చారట, ఇది 200వ నెంబర్ అని చెప్పింది. అందుకే తన నెంబర్ను రామ్ చరణ్ 200 అని సేవ్ చేసుకున్నానంటూ వివరణ ఇచ్చింది. ఇది తెలిసి అంతా షాక్అవుతున్నారు. చరణ్ ఫోన్ నెంబర్ వెనుక ఇంత కథ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. అలాగే చరణ్, ఉపాసనలది లవ్ మ్యారేజ్ అనే విషయం తెలిసిందే. వారు ప్రేమించుకుంటున్న సమయంలో ఉపాసన చరణ్కి ఓ కండిషన్ పెట్టిందట.
Also Read: Pooja Hegde: ‘బాహుబలి 3′లో ప్రభాస్ సరసన నేనే హీరోయిన్.. పూజా షాకింగ్ కామెంట్స్
చరణ్ కి ప్రేమ పరీక్ష
తను నిజంగా తనని ప్రేమిస్తే.. తనని చార్మినార్ తీసుకువెళ్లి.. ఫేమస్ ఐస్‌క్రీం తినిపించాలని చెప్పిందట. చరణ్ సెలబ్రిటీని అనే విషయాన్ని పక్కన పెట్టిన ఉపాసన కోరికను తిర్చాడట. తను చెప్పినట్టుగా చార్మినార్ తీసుకువెళ్లి ఐస్క్రిం తినిపించాడట. అయితే అక్కడ అందరు చరణ్ని గుర్తు పట్టి సెల్ఫీ అంటూ మీద పడిపోయారంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. పెళ్లి తర్వాత మెగా కుటుంబ సంప్రదాయాలు అవగాహన లేకపోవడంతో తను ఏం చేసిన అంత షాక్ అయ్యేవారట. అయితే పెళ్లయిన కొత్తలో మొదటి సారి మెగా కుటుంబంతో కలిసి భోజనం చేస్తుండగా.. అందరు మొదట కర్రీతో అన్నం తిట్టే.. తాను మాత్రం పెరుగుతో తిన్నదట. ఉపాసన అలా తినడం చూసి అంతా నన్ను ఆశ్చర్యంగా చూశారు. పెరుగు ముందు తింటున్నావేంటని షాకవుతూ అడిగారు. తనకు ఇలానే అలవాటు అని చెప్పడంతో.. మామయ్య (చిరంజీవి) పెరుగు చివర్లో తినాలని, అదే ఆరోగ్యానికి మంచిదని చెప్పారు అంటూ నాటి సంగతులను గుర్తు చేసుకుంది.