Coolie collections : తమిళ హీరో, సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ అక్కినేని నాగార్జున కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం కూలీ.. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో అమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషించడంతో ఈ మల్టీస్టారర్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళనాడులో మాత్రం ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. కలెక్షన్స్ కూడా ఎక్కువగానే వస్తున్నట్లు టాక్.. మొదటి వీక్ పూర్తి అయ్యేటప్పటికి కలెక్షన్స్ ఎలా వసూల్ అయ్యాయో తెలుసుకోవాలని రజినీ అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ మూవీ కలెక్షన్స్ ఎన్ని కోట్లో ఒకసారి తెలుసుకుందాం..
దారుణంగా పడిపోయిన ‘కూలీ’ వీకెండ్ వసూళ్లు..
హీరో రజనీకాంత్‌కు తమిళనాడుతో సమానంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ మేరకు కూలీకి ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ దక్కాయి. మొదటి వీక్ లో కొంచెం డల్ గా కలెక్షన్స్ వసూల్ అయ్యాయి. కూలీకి మొదటి రోజు 68 కోట్ల నెట్ వచ్చింది. రెండో రోజు 116.50 కోట్లు వచ్చాయి. అంటే ఒక్క రెండో రోజు 48.5 కోట్ల నెట్ వచ్చింది. వీకెండ్ కలెక్షన్స్ భారీగా పెరుగుతాయని రజిని అభిమానులు అభిప్రాయపడ్డారు.. కానీ దారుణంగా కలెక్షన్లను వసూల్ చేసిందని టాక్.. ప్రపంచ వ్యాప్తంగా 192 కోట్లు కలెక్ట్ చేసిందని టాక్.. ఈ కలెక్షన్స్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
‘కూలీ’ ప్రీ బిజినెస్ & టార్గెట్..
రజినీకాంత్ కు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. తెలుగు హీరోలతో కలిసి రజినీ ఎన్నో సినిమాల్లో నటించారు.. ఇప్పుడు కూలీ చిత్రంలో నాగార్జున తో కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాల తో కలిపి కూలీకి రూ.370 కోట్ల భారీ బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వస్తున్నాయి.. ఈ మూవీకి రజినీ రెమ్యూనరేషన్ ను తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే.. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సునీల్‌కు చెందిన ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 53 కోట్ల సొంతం చేసుకున్నాడు.
Also Read: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్.. అమ్మాయి ఎవరంటే..?
కూలీబ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ఈ చిత్రం 307 కోట్ల రూపాయల షేర్.. 600 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేయాల్సి ఉంది. ఇక వార్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 305 కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చెయ్యాలి.. అలాగే టోటల్ 600 కోట్ల గ్రాస్ ను వసూళ్లను రాబట్టాల్సి ఉంది. 1000 కోట్లు వసూల్ చేస్తుందని ఇండస్ట్రీలో మొదటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి..ఇప్పుడు చూస్తుంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు.. చూడాలి కలెక్షన్స్ ఎలా ఉంటాయో.. అటు వార్ 2 కు పోటీలో ఉంది..