Condor Airlines plane: ఈ మధ్యకాలం తరచూ విమాన ప్రమాదాలు, చిన్న చిన్న ఘటనలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిస్థితి గమనించి పైలట్ వెంటనే ఎమర్జెన్సీగా ఇటలీలో ల్యాండ్ చేశారు. అసలేం జరిగింది.
గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న కాండోర్ బోయింగ్ విమానంలో ప్రమాదం జరిగింది. విమానం భూమి నుంచి 1500 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారి ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో 273 మంది ప్రయాణికులు ఉన్నారు. కుడివైపు ఇంజిన్‌లో టెక్నికల్ సమస్యలు వెంటాడాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ శబ్దం వినిపించింది.
పరిస్థితి గమనించిన పైలట్ విమానాన్ని ఇటలీలోని బ్రిండిసి ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. కేవలం ఒక ఇంజిన్‌తో సురక్షితంగా సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. పైలట్ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది ప్రయాణికులు, నెటిజన్లు ప్రశంసించారు.
విమానం కిటికీలో బడి ఆ సన్నివేశాన్ని చూసిన ప్రయాణికులు సిబ్బంది అలర్ట్ చేశారు. ఈ విమానం గ్రీస్‌లోని కోర్ఫు ద్వీపం నుంచి వెళ్తుండగా పర్యాటకులు ఈ సన్నివేశాన్ని తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. దీనికి సంబంధించి దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. విమానం అత్యవసరంగా ల్యాండ్ కాగా, అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
ALSO READ: దీపావళి టికెట్లకు ఫుల్ డిమాండ్.. బుకింగ్ ఓపెన్ అయిన క్షణాల్లో
ప్రయాణికులను సేఫ్‌గా కిందకు దించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఘటన తర్వాత కాండర్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటన చేసింది. ప్రయాణికుల భద్రత అత్యంత ప్రాధాన్యమని తెలిపింది. జరిగిన ఘటన నేపథ్యంలో ప్రయాణికులకు అసౌకర్యానికి క్షమాపణలు కోరింది ఆ సంస్థ.
మరుసటి రోజు ప్రయాణికులను జర్మనీకి ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇదిలాఉండగా విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడంతో హోటల్ రూమ్స్ లేవు. దీంతో గంటల కొద్దీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఉండిపోయారు. కొద్దిగంటల తర్వాత అప్పుడు ప్రయాణికులను హోటళ్లకు తరలించారు.
ఈ ఘటన నేపథ్యంలో బోయింగ్ విమానాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఎందుకు తరచూ ప్రమాదాల బారినపడుతున్నాయి? సరిగా మెయింటెనెన్స్ లేకపోవడమే కారణమా? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత తరచూ ప్రపంచంలో ఏదో ఒక చోటు విమానలకు సంబంధించి రకరకాల ఘటనలు జరుగుతున్నాయి. దీంతో విమానం ఎక్కే ప్రయాణికులు కాస్త భయపడుతున్నారు. కొంతమంది మాత్రం ఇలాంటి ఘటనలు తేలిగ్గా తీసుకుంటున్నారు. ఏదో విమానంలో జరిగిందని, అన్ని విమానాలపై అనుమానం పడడం కరెక్టుకాదని అంటున్నారు.
విమానం గాలిలో ఉండగా మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న బోయింగ్-757 విమానంలో మంటలు
273 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం
మంటలు చెలరేగడంతో అప్రమత్తమై ఇటలీలోని బ్రిండిసి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు pic.twitter.com/FLqHBtoQnv
— BIG TV Breaking News (@bigtvtelugu) August 18, 2025