BigTV English

Bigg Boss 9 Telugu : అనారోగ్యంతో హౌస్‌ నుంచి ఈ కంటెస్టెంట్ అవుట్.. పాపం అస్సలు ఊహించలేదు..

Bigg Boss 9 Telugu : అనారోగ్యంతో హౌస్‌ నుంచి ఈ కంటెస్టెంట్ అవుట్.. పాపం అస్సలు ఊహించలేదు..
Advertisement

Bigg Boss 9 Telugu : తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందుతూ.. విమర్శలతో బాగా పాపులారిటిని సొంతం చేసుకున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. 8 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో 9వ సీజన్ ప్రస్తుతం ప్రసారమవుతుంది. సెప్టెంబర్ 7న ఈ షో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఇప్పటికే ఆరు మంది హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయారు. ఐదో వారం వైల్డ్ కార్డు ద్వారా కొంత మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు ఎంత రచ్చ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అయితే ఏడో వారం నామినేషన్స్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. నెటిజన్లు ఊహకందని విధంగా ఈ వారం హౌస్ నుంచి ఓ లేడీ కంటెస్టెంట్ బయటికి వెళ్లబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె నామినేషన్స్ వల్ల బయటికి వెళ్లడం లేదట.. కేవలం అనారోగ్య సమస్యల కారణంగా బయటికి వెళ్తున్న అంటూ టాక్ వినిపిస్తుంది. ఆమె ఎవరు అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..


ఏడో వారం అయేషా అవుట్..

ప్రతి సీజన్లో హౌస్ లో ఎవరో ఒకరు అనారోగ్య సమస్యలతో పోరాడుతూనే ఉంటారు. సరిగ్గా నిద్ర లేకపోవడం, తిండి లేకపోవడం, అలాగే టాస్కులు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్లు అనారోగ్యానికి గురవుతున్నారు అన్న వాదన వినిపిస్తుంది. ప్రతి సీజన్ ఎవరో ఒక కంటెస్టెంట్ ఇలాంటి సమస్యతో ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తున్నారు. ఈ సీజన్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆయేషా అనారోగ్య సమస్యలతో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేసిందట. దాంతో ఆమెను బయటికి పంపించేందుకు బిగ్ బాస్ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది.. మరి ఈమెతోపాటు మరొకరు కూడా హౌస్ నుంచి వెళ్తారా? ఈవారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందా అన్నది తెలియాలంటే కచ్చితంగా వీకెండ్ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Also Read :బిగ్ బాస్‌లోకి అమర్ దీప్, అర్జున్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్‌కు ఊహించని షాక్..!


కంటెస్టంట్స్ కు ఊహించని ట్విస్ట్.. 

ఏడో వారం హౌస్ లో జరుగుతున్న టాస్క్ లు జనాలను కన్యుఫ్యూజన్ లో పడేస్తున్నాయి. ప్రస్తుతం గ్యాంగ్ వార్స్ అనే టాస్క్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ టాస్క్ ద్వారా కెప్టెన్సీ కంటెండర్లు గా కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ద వార్ హౌస్ లో జరుగుతుందని చెప్పాలి.. బిగ్ బాస్ డిఫరెంట్ టాస్కులతో కంటెస్టెంట్ల మధ్య టఫ్ ఫైట్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఈవారం నుంచి టాస్కులు కాస్త ఆసక్తిగా ఉండడంతో ఆడియన్స్ కూడా బిగ్ బాస్ ని చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలాగే హౌస్ లోకి బిగ్ బాస్ విన్నర్, రన్నర్ అయినటువంటి అర్జున్ అంబటి, అమర్ దీప్ లను మళ్లీ తీసుకొచ్చారు. అసలు వీళ్ళిద్దరి ఎందుకు వచ్చారు అని జనాలు బుర్రకోకుంటున్నారు. ఈరోజు ఎపిసోడ్ లో వీరిద్దరూ ఏం చేస్తారో చూడాలి.. వైల్డ్ కార్డు ఎంట్రీ ల ద్వారా వచ్చినా రమ్య చిట్టి పీకిల్స్ పై నెట్టింట ట్రోల్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అటు మాధురి కూడా ఎక్కడ తగ్గకుండా కంటెస్టెంట్లకి వరుసగా షాక్ లిస్టు టాస్కులలో చురుగ్గా పాల్గొంటుంది. మరి ఈ సీజన్ విన్నర్ గా తనుజ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఎవరు విన్నర్ అవుతారు? ఎవరు రన్నర్ అవుతారు? తెలియాలంటే ప్రతి ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్‌లోకి అమర్ దీప్, అర్జున్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్‌కు ఊహించని షాక్..!

Bigg Boss 9 Telugu : కోడిలా మారిన ఇమ్మూ… బురదలో ఫిజికల్ టాస్క్.. ఇదేం ఆటరా నాయనా..

Bigg Boss 9: ఎక్కడ తగ్గని తనూజ.. ఇమ్మాన్యుయేల్, రీతూ డబుల్ గేమ్.. మళ్లీ సంజనపై నెగ్గిన మాధురి..

Rithu Chaudhary : గౌరవ్ సూపర్ డెసిషన్, రీతుకు మొహం మీదే చెప్పేసాడు

Bigg Boss Thanuja : స్టార్ మా సీరియల్ బిడ్డ కాబట్టి తనుజ ను అంతలా లేపుతున్నారా? బిగ్ బాస్ చీకటి కోణం 

Madhuri Thanuja : రాజు అంటూనే మాధురికి నమ్మకద్రోహం, మనం కొన్ని కొన్ని నటించాలి

Venu Swamy-Bigg Boss 9: బిగ్‌ బాస్‌ బ్యాన్‌.. బాగా కాలుతున్నట్టుంది.. వేణుస్వామి సంచలన కామెంట్స్‌

Big Stories

×