E-Paper
Advertisement

సలార్ 2 పై ప్రభాస్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే క్రేజీ అప్డేట్!

సలార్ 2 పై ప్రభాస్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే క్రేజీ అప్డేట్!
Advertisement

Salaar 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస పెట్టి సినిమాలు చేస్తూ మరింత ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఒకవైపు ఫ్యామిలీ ఓరియెంటెడ్ మరొకవైపు యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేస్తూ దూసుకుపోతున్న ఈయన.. గతంలో కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ (Prashanth Neel) దర్శకత్వంలో సలార్: పార్ట్ -1: సీజ్ ఫైర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇకపోతే గతంలో హోం భలే ఫిలిమ్స్ ఈ సినిమాను పట్టా లెక్కించకుండా ప్రశాంత్ – ప్రభాస్ కాంబినేషన్లో మరో కొత్త కథతో రాబోతున్నారనే వార్తలు వచ్చాయి . ఆ సమయంలో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం ఉంటుందని.. దీనిని తెరకెక్కించడానికి చిత్ర బృందం కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం.

సలార్ పార్ట్ 2 నుండి అదిరిపోయే అప్డేట్..

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ ప్రభాస్ అభిమానులకు పిచ్చెక్కిస్తోంది అనడంలో సందేహం లేదు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మొదటి భాగం ముగింపులో ఇచ్చిన క్లూ ఆధారంగా శౌర్యంగ తెగకు సంబంధించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ శౌర్యంగపర్వం ఏ విధంగా చూపించబోతున్నారు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇక అభిమానుల అంచనాలను రెట్టింపు చేస్తూ కథలో ఇంటెన్స్ ను పెంచుతూ మొదటి భాగానికి మించిన యాక్షన్ సన్నివేశాలతో ఈ సీక్వెల్ ను తీర్చిదిద్దడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే మొదటి భాగమే అదిరిపోయింది అంటే రెండవ భాగం అంతకుమించి అనే కామెంట్లు వ్యక్తం అవుతుండడంతో అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

షూటింగ్ మొదలయ్యేది అప్పుడే..

Advertisement

ఇక ఎప్పుడు ఈ సినిమా పట్టాలెక్కుతుంది అనే విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రశాంత్ నీళ్ .. ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అటు ప్రభాస్ కూడా ఫౌజీ, స్పిరిట్ సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నారు. కాబట్టి ఇద్దరు కూడా తమ తమ ప్రాజెక్టుతో బిజీ ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది తమ తమ ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసి.. ఈ సినిమా సెట్ లోకి అడుగు పెట్టబోతున్నారట. ఈ గ్యాప్ లో స్క్రిప్ట్ వరకు ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కాగా చేయాలని అటు మేకర్స్ కూడా భావిస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే 2027 మొదటి రెండు నెలల్లో సలార్ 2 సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈలోపు ఈ ఏడాది చివర్లో ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక అప్డేట్ కూడా రానుందని సమాచారం.

ALSO READ:భార్య సంగీతకి విజయ్ విడాకులు.. సెటిల్మెంట్ అన్ని కోట్లా?!

హోంబలే కఠిన నిర్ణయం..

Advertisement

ఇకపోతే ఈ శౌర్యంగపర్వంలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య సాగే ఆధిపత్య పోరును చాలా ఉత్కంఠభరితంగా చూపించబోతున్నారు. హోం భలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పుడు అంచనాలు కూడా భారీగా ఉండడంతో..ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించాలని చిత్ర బృందం భావిస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

Big Stories

Advertisement
×