E-Paper
Advertisement

రేణు దేశాయ్‌పై ట్రోలింగ్.. విశాఖ వ్యక్తికి ‘సైబర్’ బేడీలు!

రేణు దేశాయ్‌పై ట్రోలింగ్.. విశాఖ వ్యక్తికి ‘సైబర్’ బేడీలు!
Advertisement

Renu Desai: సోషల్ మీడియాని మిస్ యూజ్ చేస్తూ సెలబ్రిటీలని టార్గెట్ చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలబోమంటూ మరోసారి ప్రూవ్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.మ్యాటర్ లోకి వెళ్తే పవర్ స్టార్, ap డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ మాజీ భార్య,ప్రముఖ నటి రేణు దేశాయ్ పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బూతులతో ట్రోలింగ్ అవుతున్న సంగతి తెల్సిందే. ఇక రేణు దేశాయ్ పైనే కాకుండా పిల్లలైన ఆధ్యా అకిరాలపై కూడా ఈ ట్రోలింగ్ మరింత పెరిగిపోవడంతో రేణు సైబర్ క్రైమ్ పోలీసుల వద్ద కేస్ ఫైల్ చేసింది.

విశాఖపట్నానికి చెందిన ఇద దాసు అప్పారావు

Advertisement

ఇక ఈ కేస్ ఆధారంగా ఇప్పటికే నలుగురిని కటకటాల్లోకి నెట్టిన పోలీసులు తాజాగా మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. విశాఖపట్నానికి చెందిన ఇద దాసు అప్పారావు అనే వ్యక్తి సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను క్రియేట్ చేసి ఆడవాళ్ళని వేదించడమే పనిగా పెట్టుకున్నాడని,ఆ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్ లో రేణు దేశాయ్ పోస్ట్ చేసే వీడియో ల కింద బూతులతో కామెంట్స్ చేసినట్టు గుర్తించారు.దీంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడి ఐపీ అడ్రస్, మొబైల్ సిగ్నల్స్ మరియు లొకేషన్‌ను ట్రాక్ చేసిన సైబర్ క్రైమ్ టీమ్, విశాఖలో అతడిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. ఇక నిందితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను సీజ్ చేసిన అధికారులు, దానిలోని డేటా ఆధారంగా అతడు ఇంకా ఎవరెవరిని టార్గెట్ చేశాడన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని సమాచారం.ఇక ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీసులు నెటిజన్లకు గట్టి వార్నింగే ఇచ్చారు. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అంటూ ఎవరైనా ఇలా ఆడవాళ్ళ మరియు సెలబ్రిటీల గౌరవానికి భంగం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు.

also read:అక్కినేని కాంపౌండ్‌లోకి మళ్ళీ సమంత? విడాకుల తర్వాత కూడా సుప్రియ కోసం ఇలా! నెట్టింట రచ్చ లేపుతున్న సామ్ పోస్ట్!

Advertisement

నీ పిల్లలని  కుక్కలు కరిస్తే  తెలుస్తుంది

ఇకపొతే పవన్ కళ్యాణ్ తో డైవోర్స్ తీసుకొని  దాదాపు 14 ఏళ్లు కావస్తున్నా,ఇప్పటికీ కొంతమంది ఆమె గతాన్ని తవ్వుతూ కొంతమంది వ్యక్తిగతంగా బూతులతో ట్రోల్ చేస్తున్నారు, అయితే  ఈ ఏడాది జనవరిలో వీధి కుక్కల దాడికి సంబంధించి జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో పాల్గొన్న రేణు దేశాయ్ పాల్గొని కుక్కలను చంపొద్దు అంటూ కాస్తంత గట్టిగా మాట్లాడిన తర్వాత నుంచే ఈ బూతుల దాడి ఎక్కువైనట్టుగా తెలుస్తుంది.ముఖ్యంగా ‘నీ పిల్లలని  కుక్కలు కరిస్తే  తెలుస్తుంది’అంటూ కొందరు మాట్లాడితే,కొంతమంది ఏకంగా ఆమె శరీర భాగాలపై కుక్కలు దాడి చేయాలంటూ నీచమైన కామెంట్లు చేయడం సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది.

నా పిల్లలపై అసభ్య కామెంట్లు చేస్తే ఊరుకోను

ఇదే విషయం పై రేణు దేశాయ్ మాట్లాడుతూ  “నా నటన నచ్చకపోతే విమర్శించండి, కానీ నా వ్యక్తిగత జీవితంపై, నా పిల్లలపై అసభ్య కామెంట్లు చేస్తే ఊరుకోను. ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి మీ తల్లిదండ్రులకు మీరు ఏం చేస్తున్నారో చెప్తాను” అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.ఇక ఈ క్రమంలోనే  పోలీసులు రంగంలోకి దిగి వరస అరెస్టులు చేస్తున్నారు.చూడాలి మరి పోలీసుల యాక్షన్ తో అయినా ఫేక్ పీపుల్ బూతు పురాణానికి అడ్డుకట్ట వేస్తారో లేదో !

also read:ప్రభాస్‌ను వదలని టెన్షన్.. ‘ఫౌజీ’ షూటింగ్‌లో హడావిడి.. ప్లాన్ రివర్స్ అయితే పరిస్థితి ఏంటి?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×