Bahubali The Epic :దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) మరోసారి బాహుబలి(Bahubali) మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. గతంలో వచ్చిన బాహుబలి 1&2 భాగాలను ఒకటిగా కలిపి ఇప్పుడు ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్ పై రిలీజ్ చేస్తున్నారు. ఈ బాహుబలి నుండి ట్రైలర్ కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ సినిమా రన్ టైము 3:40 గంటలని నిర్మాత శోభు యార్లగడ్డ ఇటీవలే వెల్లడించారు. బాహుబలి 1 ముగిసాక ఇంటర్వెల్ అని ఆ తర్వాత బాహుబలి 2 ఉంటుందని కూడా ఆమె స్పష్టం చేశారు. సీనియర్ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ (3: 46గంటలు) సినిమా తర్వాత ఎక్కువ నిడివి ఉన్న సినిమాల జాబితాలో బాహుబలి ది ఎపిక్ (3:40 గంటలు) కూడా చేరనుంది అని ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు ఈ చిత్రంలో ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది అని చెప్పి అంచనాలు పెంచిన ఆమె బాహుబలి డాక్యుమెంటరీ ఈ ఏడాది ఆఖరున ఓటీటీ లో స్ట్రీమింగ్ కి రావచ్చు అని కూడా స్పష్టం చేసింది.
ఇకపోతే బాహుబలి 1, 2 చిత్రాలు ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రాలుగా ఇవి నిలిచాయి. అందులో భాగంగానే ఇప్పుడు రెండు సినిమాలను ఒకే సినిమాగా చేసి రిలీజ్ చేస్తుండడంతో కచ్చితంగా 100 కోట్ల క్లబ్లో చేరుతుందని ఇటు అభిమానులే కాదు అటు మేకర్స్ కూడా చాలా ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ బాహుబలి మూవీకి కొత్త భయం చుట్టుకుంది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ భయం నుండి ప్రభాస్ కూడా కాపాడలేడు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ALSO READ:Bigg Boss 9 Promo : మాధురి vs శ్రీజ… ఆ నోళ్ల మోతను భరించాల్సిందేనా…
మొంథా తుఫాన్.. ప్రస్తుతం ఈ తుఫాను ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ తుఫాను ఎఫెక్ట్ ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ పై పడనున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా రీ రిలీజ్ కి వర్షం అడ్డంకిగా మారిపోయింది అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా సరే భీకరమైన వర్షాలు ప్రజలను బయటకు రానివ్వడం లేదు. ఒక ఆంధ్రాలోనే కాదు అటు నైజాం ఏరియాలో కూడా ఎడతెరపని వర్షాలు పడుతున్నాయి. ప్రభాస్ సినిమాలంటే ఎక్కువగా చూసే ఉత్తరాంధ్రలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పైగా ఈ చిత్రం విడుదల సమయంలో ఎటువంటి హాలిడేస్ కూడా లేవు. అందుకే అటు వర్షం ప్రభావం.. ఇటు సెలవులు లేకపోవడం రెండు కూడా సినిమా కలెక్షన్ల పై దెబ్బ పడేలా చేస్తున్నాయనీ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి ప్రభాస్ పట్టు ఉన్న కోస్తా ఆంధ్రాలో కూడా ఈ తుఫాన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అక్కడ వర్షాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి ప్రభాస్ కి పట్టు ఉన్న ప్రాంతంలో కూడా కలెక్షన్లు పెద్దగా రాకపోవచ్చు అని తెలుస్తోంది. ఏది ఏమైనా సరిగ్గా ఒక మంచి సమయాన్ని ఎంచుకొని విడుదల చేయాలనుకున్న సమయంలోనే ఈ మొంథా తుఫాను భారీ ఎఫెక్ట్ చూపించబోతుందని స్పష్టం అవుతుంది.
ఇకపోతే అక్టోబర్ 31న అనగా అదే రోజు రవితేజ మాస్ జాతర రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ బాహుబలి కి ఉన్న క్రేజ్ ను బట్టి వీరు ఒక రోజు వెనుకడుగు వేశారు. కాబట్టి మాస్ జాతర నవంబర్ 1న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మాస్ జాతర సినిమా బాహుబలికి ఏమాత్రం అడ్డం పడదు. అయితే ఇప్పుడు ఎక్కువగా వర్షాల కారణంగానే కలెక్షన్లు భారీగా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.